సింగిల్ చార్జ్‌పై 650 కి.మి ఇచ్చే కొత్త వోల్వో కార్ ఇదే?

Purushottham Vinay
ప్రస్తుతం మొబైల్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. తక్కువ శ్రేణి కార్లు దగ్గర నుంచి హై ఎండ్, లగ్జరీ కార్ల దాకా అంతా ఎలక్ట్రిక్ వేరియంట్లో మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి.ఇదే క్రమంలో ఫేమస్ లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో కూడా హై ఫీచర్డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. వోల్వో ఈఎక్స్90 ఎక్స్‌లెన్స్ పేరుతో ఆటో షాంగై లో ప్రదర్శించడం జరిగింది. ఇక 2022 నవంబర్ లో ఈఎక్స్90 పేరుతో ఓ ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేసింది. ఇప్పడు దానికన్నా అడ్వాన్స్ డ్ ఫీచర్లతో ఈ ఈఎక్స్90 ఎక్స్ లెన్స్ పేరుతో ఎస్యూవీని లాంచ్ చేసింది. నాలుగు సీట్ల కెపాసిటీతో కూడిన ఈ ఎస్యూవీ మొదట చైనాలో మాత్రమే ఈ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు ఈ కార్ కి సంబంధించిన ఫీచర్లు, స్పసిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..ఈ వోల్వో ఈఎక్స్90 ఎక్సలెన్స్.. స్టాండర్డ్ ఈఎక్స్90 వలె ఉంది. అయితే డ్యూయెల్ టోన్ పెయింట్ థీమ్ ఇంకా 22 ఇంచ్ అలాయ్ వీల్స్ కొత్తగా వస్తున్నాయి. ఇంకా అలాగే క్యాబిన్ లో కూడా స్టాండర్డ్ వెర్షన్ నుంచి చాలా మార్పులని చేసింది.


అలాగే ఈ మోడల్ క్యాబిన్ చాలా అపీలింగ్ లుక్తో ఉంటుంది. డాష్బోర్డ్ కూడా సింపుల్గా కనిపిస్తుంది. అలాగే భారీ ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్ వర్టికల్గా ఉంటుంది. ఈ ఎస్యూవీ కార్ సెకెండ్- రోలో 2 సీట్స్ ఉంటాయి. స్పేషియస్గా ఇంకా కంఫర్ట్గా అనిపిస్తుంది.అలాగే సెకెండ్ రోలో ఆర్మ్ రెస్ట్కి ఓ ప్రత్యేకత కూడా ఉంది. బాటిల్స్, గ్లాస్లు పెట్టుకునేందుకు కూడా స్పేస్ లభిస్తోంది. ఇంకా  సెంటర్ ఆర్మ్రెస్ట్లో లగ్జరీ ఫీల్ని తీసుకొచ్చే గ్లాస్ హోల్డర్స్ కూడా వస్తున్నాయి.అలాగే టచ్ పానెల్స్ కూడా ఉంటాయి.ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది.ఇక ఇందులోని 111కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ వెహికిల్ ఏకంగా 650కి.మీల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిలో 496 హెచ్పీ, 909 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే మోటార్ అనేది ఉంటుంది.ఆ తరువాత ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ కనెక్టవీటి ఉంటుంది. ఇంకా చాలా అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.ఇంకా అదే విధంగా 14.5 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: