హృతిక్ రోషన్ రెండో పెళ్ళికి మొదటి భార్య గ్రీన్ సిగ్నల్ ?

VAMSI
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అక్కడే కాదు టాలీవుడ్ లోను ఫుల్ క్రేజ్ ను పెంచుకున్నారు. ఇక్కడ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో గురించి ఇపుడు ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ స్టార్ హీరో గురించి తన మాజీ భార్య షాకింగ్ కామెంట్స్ చేయడంతో విషయం కాస్త హాట్ టాపిక్ గా వైరల్ అవుతోంది. హృతిక్ రోషన్ కొన్నాళ్ల క్రితం తన భార్య సుసానేకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పిల్లల కోసం హృతిక్ అప్పుడప్పుడు తన భార్యను కలుస్తూ ఉంటారన్నది కూడా తెలిసిందే. అయితే విడాకులు అయిన చాలా కాలం తరవాత ఈ బాలీవుడ్ అందగాడు సింగర్‌ సబా ఆజాద్‌ ప్రేమలో పడ్డారని...వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారంటూ చాలా పుకార్లు షికార్లు సంగతి తెలిసిందే.

అంతే కాకుండా వీరిద్దరూ కలిసి పలుమార్లు కెమెరాకు చిక్కడంతో వార్తలు నిజమేనని అంతా అనుకుంటున్నారు. ఇక మరోవైపు హృతిక్ రోషన్ మాజీ భార్య సైతం మరో బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇలాంటి టైం లో సింగర్ సభానే  పోస్ట్ కు  సుసానా స్పందించడంతో అంతా అవాక్ అవుతున్నారు. తాజాగా హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయగా అందుకు స్పందించిన సుసానే ఈ వీడియోలో చాలా హాట్ గా ఉన్నావ్ సబూ అంటూ కామెంట్ చేసింది. హృతిక్ సింగర్ సభా తో డేటింగ్ లో ఉన్నారు అంటూ వినపడుతున్న టైం లో ఇలా అతడి భార్య సభా ను నిక్ నేమ్ తో పిలిచి మరి పొగడడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

వాస్తవంగా ఇలాంటివి బాలీవుడ్ లో కొత్తేమీ కాదు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి అనుకుని నెటిజన్లు సైతం సర్దుకుపోతున్నారు. అయితే ఇక తన మాజీ భార్య నుండి కూడా మద్దతు దొరికినట్లే అని తెలుస్తోంది. దీనిని బట్టి త్వరలోనే హృతిక్ మనకు తన రెండవ పెళ్లి గురించిన వార్తను చెప్పే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: