పవన్ కళ్యాణ్ 'అత్త' కెరీర్ అలా కావడానికి కారణం ఆ హీరోనా ?
ఎక్కువగా నదియా అప్పటి తక్కువ రేంజ్ ఉన్న హీరో సురేష్ తో సినిమాలు చేసింది. అయితే సురేష్ కు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఈజీగానే హీరోగా అవతారం ఎత్తాడు. అలా తన మొదటి సినిమా తమిళ్ లో నదియా తో కలిసి చేశాడు. అయితే అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. దాంతో దర్శక నిర్మాతలు వీరిది హిట్ పెయిర్ గా భావించి వరుస సినిమాలను చేసేవారు. ఆ విధంగా ఈ ఇద్దరు కొన్ని సినిమాలలో నటించడం జరగగానే... ఎప్పటిలాగే ఇండస్ట్రీ వర్గాలు మరియు గాసిప్ రాయుళ్లు సురేష్ మరియు నదియాల మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలను స్ప్రెడ్ చేశారు. అయితే ఇద్దరూ కూడా ఈ వార్తల వలన చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి.
ముఖ్యంగా సురేష్ చొరవ తీసుకుని ఆమెతో మాట్లాడి ఇక మీతో సినిమాలో నటించను అంటూ తప్పుకున్నాడట. అంతటితో ఆగకుండా తాను వేరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక నదియా కూడా ఒక ఎన్ ఆర్ ఐ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అయితే వీరి మధ్య ఇలాంటి గాసిప్ లు రాకుండా ఉండి ఉంటే... నదియా మరి కొంతకాలం హీరోయిన్ గా ఉండేది అని ఇప్పటికే చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు.