సెక్స్ లో వాట్సాప్ సెక్స్ కథే వేరయ్యా..
విశాఖపట్నం పోర్ట్ సిటీలో
వ్యభిచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అమ్మాయిలను ఆకర్షించడానికి నేరస్తులు వాట్సాప్
వంటి సోషల్ మీడియా ఆప్లికేైషన్లను ఉపయోగించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దీంట్లో
కూడా వీరు నూతన మార్గం అవలంబించడం గమనార్హం. నూతన కస్టమర్ తనకు అమ్మాయి కావాలని
ఆర్డర్ ఇవ్వాలంటే అతగాడు కనీసం ఒక పాత కస్టమర్‍ను రిఫరెన్స్‌గా పేర్కొనాల్సి
ఉంటుంది. ఇది పోలీసులనుంచి తప్పించుకోవడానికి నూతన మార్గం.
ఈ కొత్త రకం సెక్స్ బాధితుల్లో చాలామంది చిన్నవయస్సు బాలికలే. వీరు తమ కుటుంబాలను పోషించుకోవడానికి డబ్బుకోసం వ్యభిచారానికి సిద్ధమవుతున్నారు. దళారీలు ముందుగా ఇలాంటి అమ్మాయిల కుటుంబాలను సంప్రదిస్తారు.50 వేల రూపాయల అడ్వాన్సు చెల్లించి ఆరునెలలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. అదే సమయంలో ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకుడికి మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి నుంచి 5 లక్షల రూపాయల లాభం పొందుతాడు. చిన్నవయసు బాలికల కోసం మద్య వయస్కులు, ముదుసలి కస్టమర్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎంత డిమాండ్ ఉంటే అంత లాభం నిర్వాహకులకు లభిస్తుందన్నమాట.
పోలీసుల అభిప్రాయం ప్రకారం బ్యూటీ పార్లల్, మసాజ్ సెంటర్లలో అమ్మాయిల వ్యాపారం సర్వసాధారణంగా జరుగుతోంది. పోలీసులు ఇటీవల జరిపిన దాడుల్లో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్టాలనుంచి కూడా విశాఖకు అమ్మాయిలను తెప్పిస్తున్నారని తెలిసింది.