విజయవాడలో బెంజ్ షోరూం..!

shami
మెర్సిడిస్ బెంజ్ మరో సరికొత్త షోరూంను ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించింది. మహవీర్ మోటార్స్ వారు నడిపిస్తున్న ఈ షోరూం ఎంతో ప్రసిద్ధి చెందినది. దీనితో కలిపి సౌత్ ఇండియాలోని 10 మేజర్ సిటీస్ లో బెంజ్ అవుట్ లెట్స్ 23 అవ్వడం విశేషం. ఇక విజయవాడలో పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొత్త క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ఈ అవుట్ లెట్ పెట్టడం వల్ల కంపెనీ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది వారి ఆలోచన.   


అంతేకాదు గుంటూర్, రాజమండ్రి, ప్రకాశం, విశాఖపట్నం ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఇక విజయవాడలో ఏర్పడ్డ ఈ సరికొత్త షోరూం నేషనల్ హైవే 5 మీద సర్వే నంబర్ 250/11 లో 20,000 ఎస్.ఎఫ్.టి తో నిర్మించబడింది. ఇది షోరూంగా, వర్క్ షాప్ గా కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.    


మహవీర్ మోటార్స్ వారు మొత్తం నాలుగు కార్లను ప్రదర్శనలో ఉంచడం జరుగుతుంది. 90 కార్ల సర్వీస్ చేసే కెపాసిటీతో ప్రయాణీకుల సౌలభ్యం కోసమే ఈ షోరూంను ఓపెన్ చేయడం జరిగింది. వర్క్ షాప్ లో స్పేర్ పార్ట్స్ మరియు యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఈ సరికొత్త షోరూం గురించి బెంజ్ సి.ఈ.ఓ రోలాండ్ ఫోల్జర్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న నగరంగా ముందంజలో ఉన్న విజయవాడలో మా షోరూం ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది. లక్సరీ వెహికల్స్ లో బెంజ్ ను తలదన్నే కంపెనీ లేదు కాబట్టి మా మార్కెట్ గ్రోత్ తప్పకుండా అవుతుందని అన్నారు. 


ఇక దేశం మొత్తం మీద 40 నగరాల్లో 83 అవుట్ లెట్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మన దగ్గరకే వచ్చింది బెంజ్ షోరూం మరి లక్సరీ వెహికల్ కావాలనుకునే వారికి బెంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. కార్ కొనండి డ్రైవింగ్ లో సరికొత్త అనుభూతిని పొందండి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: