మూడు సంవత్సరాల క్రితం వచ్చిన బి.ఎం.డబల్యు ఎక్స్ 5 ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ తో రీ మోడలింగ్ చేస్తుంది కంపెనీ. ఈ రీప్లేస్ మెంట్ విధానం 2017 మొదటి కల్లా పూర్తవుతుందని తెలుస్తుంది. ఇక వచ్చే వెహికల్ ను చూస్తే తప్పకుండా కొత్త అనుభూతిని పొందుతారు అంతేకాకుండా పాత మోడల్ ను మార్చినందుకు సంతోషిస్తారు అంటున్నారు నిర్వాహకులు.
ప్రస్తుతం ఎక్స్5 7 సీరీస్ కార్ గా ప్రాముహ్యత పొందింది. బి.ఎం.డబల్యులో ఎక్స్ 5 ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. హై స్ట్రింగ్ కల స్టీల్, అల్యుమినియం, కార్బన్ ఫైబర్ మెటల్ తో ఈ వెహికల్ తయారు చేయబడ్డది. ఇక ఈ సరికొత్త ఎక్స్ 5 లుక్ ప్రస్తుతం ఉన్న అన్ని కంపెనీల కార్ల మోడల్స్ కన్నా చాలా కొత్తగా ఉంటుంది.
కొత్త లుక్స్ తో ఎట్రాక్టింగ్ ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోయే ఎక్స్ 5 2017 ఆటో ఎక్స్ పో లో ప్రదర్శితమవుతుంది. వచ్చే ఏడాది లక్సరియస్ కార్ కొనాలనే ఆలోచన ఉన్న వారు తప్పకుండా ఈ సరికొత్త ఎక్స్ 5 వెహికల్ ను ప్రయత్నించే అవకాశం ఉంది.