కస్టమర్స్ ప్రాధ్యాన్యత దృష్ట్యా హ్యుండై కంపెనీ అత్యున్నత ప్రమాణాలతో వెహికల్స్ ను అందిస్తుంది. ఇక ఈ సంవత్సరం మరో రెండు కొత్త వెహికల్స్ ను రిలీజ్ చేస్తున్న హ్యుండై 2018లో మరో రెండు 2019 కల్లా మరో మూడు అంటే 5 కొత్త వెహికల్స్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని చూస్తుంది.
2017లో హ్యుండై ఎక్సెంట్ ఫేస్ లిఫ్ట్, నెక్ష్ట్ జెనరేషన్ హ్యుండై వెర్నా రిలీజ్ చేస్తుంది. గ్రాండ్ ఐ10 ఫేస్ లిఫ్ట్ మైనర్ అప్డేట్స్ తో వస్తుంది. ఇక న్యూ డిజైన్ తో సరికొత్త వెర్నా కూడా ఈ ఇయర్ లోనే వస్తుంది. ఇక 2018లో హ్యుండై నుండి ఇయానిక్ హైబ్రిడ్ తో పాటుగా హ్యాచ్ ప్యాక్ రిలీజ్ కాబోతున్నాయి.
ఇక 2019లో ఎస్.యు.వి వెహికల్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది హ్యుండై. సబ్ 4ఎం ఎస్.యు.వి రిలీజ్ చేస్తుంది. మొత్తానికి మార్కెట్ మీద పట్టు సాధించేందుకు హ్యుండై సరికొత్త ప్రణాళికలు తెచ్చింది. మరి ఈ మోడల్స్ ప్రయాణీకులను ఏవిధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.