భారీగా తగ్గిన స్పోర్ట్స్ బైక్ ధరలు..!

shami
స్పోర్ట్స్ బైకు ధరలు అనూహ్యంగ తగ్గు ముఖం పట్టాయి. లక్సరియస్ అండ్ స్పోర్ట్స్ బైకులుగా పేరు తెచ్చుకున్న డుకాటి, హార్లే డేవిడ్ సన్ లాంటి బైకులన్ని ధరలు తగ్గించేశాయి. దాదాపు 7 లక్షల దాకా ఈ బైకు ధరలను తగ్గించారని సమాచారం. డుకాటి మాన్ స్టర్ 1200, 1200 ఎస్ రెడ్, 1200 ఎస్ చార్ కోర్ గ్రే, పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్ల మీద కూడా ధరలు తగ్గించడం జరిగింది.


ఇక హార్లే డేవిడ్ సన్ బైకులపై అత్యధికంగా 3.7 లక్షల దాకా ధర తగ్గిందని అంటున్నారు. సీవీఓ లిమిటెడ్ మోడల్ బైకు కొత్త ధర 49.99 లక్షలు. టూరింగ్ స్పెషల్ బైకులు ద రోడ్ గ్లైడ్ స్పెషల్ బైక్ పై కూడా 2.5 లక్షల దాకా తగ్గించారని తెలుస్తుంది. 35.50 లక్షలు ధర ఉన్న బైక్ ఇప్పుడు 32 లక్షలకే వచ్చేస్తుంది.


ఇండియన్ మోటర్ సైకిల్ ధరలు కూడా 3 లక్షల వరకు తగ్గు ముఖం పట్టినట్టు తెలుస్తుంది. స్పోర్ట్స్ బైకుల్లో రారాజుగా పేరు తెచ్చుకున్న డుకాటి, హార్లే డేవిడ్ సన్ బైకులే రేటు తగ్గడం షాకింగ్ గా మారింది. మరి మిగతా స్పోర్ట్స్ బైకుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: