మారుతి సుజుకి కార్ల ధరలు తగ్గింపు..!

shami
మారుతి నుండి వస్తున్న లక్సరియస్ వెహికల్స్ కు సేల్స్ పెంచేందుకు గాను అనూహ్యంగా వాటి ప్రైజ్ ను తగ్గించారు. డీలర్స్ సేల్స్ పెంచేందుకు ఈ తగ్గింపు ధరలు బాగా ఉపయోగపడుతున్నాయి. మారుతి సుజుకి నెక్సా, ఎస్ క్రాస్, సియజ్, ఐనిస్, బలెనో వీటన్నిటికి ప్రైజ్ తగ్గించడం విశేషం.  


మారుతి సుజుకి ఎస్ క్రాస్.. హ్యుండై క్రెటాకి పోటీగా మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ రిలీజ్ చేసింది. ఈ వెహికల్ ప్రస్తుతం మార్కెట్ రేటు కన్నా 70,000 తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ వెహికల్ 105 బి.హెచ్.పి, 1.5 లీటర్ కె15 స్మార్ట్ హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది.  


ఇక మారుతి సుజుకి సియజ్ వెహికల్ 65,000 ల రూపాయల తగ్గింపు ధరకు వస్తుంది. హ్యుండై వెర్నా, హోండా సిటీ, టొయోటా యారిస్ వంటి వెహికల్స్ కు ఇది గట్టి పోటీ ఇస్తుంది. ఇక మారుతి ఐనిస్ మీద 55000 రూపాయలు తగ్గించడం జరిగింది. మారుతి సుజుకి బలెనో మీద 40000 రూపాయల తగ్గింపు ధర అందుబాటులో ఉంది. మరి ఈ భారీ తగ్గింపు ధరలు కొద్దికాలమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మారుతి సుజుకి కారు కొనాలనుకునే వారికి ఇదే చక్కని అవకాశం అని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: