కె.టి.ఎం నుండి రాబోతున్న అడ్వెంచర్ బైక్ 390

frame కె.టి.ఎం నుండి రాబోతున్న అడ్వెంచర్ బైక్ 390

shami
కొన్నాళ్లుగా కె.టి.ఎం నుండి ఎదురుచూస్తున్న అడెంచర్ బైక్ 390 ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుంది. ఐక్మా 2019 మోటర్ షోలో ఈ బైక్ ప్రదర్శనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కె.టి.ఎం నుండి వచ్చే 390 బైక్ కోసం కొన్నాళ్లుగా కష్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. 390 డ్యూక్ స్ట్రీట్ ఫైటర్ బైక్ కు ఆఫ్ రోడ్ వర్షన్ గా కె.టి.ఎం 390 వస్తుంది.


ఈ ఇయర్ డిసెంబర్ లో ఈ బైక్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 373.22 సిసి కెపాసిటీతో 44 బి.హెచ్.పి పవర్, 37 ఎన్.ఎం టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ బైక్ వస్తుంది. బి.ఎస్-6 ప్రమాణాలతో వచ్చే తొలి కె.టి.ఎం బైక్ 390 అడ్వెంచర్ అని చెప్పొచ్చు.


14.5 పెట్రోల్ టాంక్ తో వస్తున్న ఈ బైక్ 158 కేజిల బరువు కలిగి ఉంటుంది. త్వరలో ఇండియ రోడ్ల మీద కె.టి.ఎం 390 అడ్వెంచర్ బైక్ తిరుగుతుంది. కె.టి.ఎం డ్యూక్ కు అప్డేటెడ్ వర్షన్ గా ఈ సరికొత్త 390 అడ్వెంచర్ బైక్ సరికొత్తగా రాబోతుంది. మరి కె.టి.ఎం లవర్స్ కు ఈ కొత్త బైక్ ఏ రేంజ్ లో నచ్చుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More