టాటా కంపెనీ కార్లపై భారీ డిస్కౌంటు ...!
భారతదేశంలో ఆటో మొబైల్ రంగ సంస్థల ప్రముఖ సంస్థ అయిన టాటా మోటార్స్ ఇప్పటివరకు ఎన్నో వాహనాలను భారత మార్కెట్లోకి విడుదల చేసి విక్రయాలలో అత్యుత్తమ స్థానంలో నిలిచింది. ఇకపోతే తాజాగా ఈ ఆటోమొబైల్ రంగ సంస్థ తన దగ్గర ఉండిపోయిన స్టాకును ఎలాగైనా విక్రయించాలని నెపంతో ఆ వాహనాలపై డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన టాటా నెక్సన్, టాటా ఆల్ట్రోజ్ లాంటి కొన్ని కార్ల మోడల్స్ పై భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. అలాగే టాటా టియాగో, టాటా హ్యారియర్ వంటి కార్ల పై కూడా వినియోగదారునికి అదనంగా కార్పొరేట్ ఆఫర్ ను ప్రకటించింది.
ఇకపోతే ఈ ఆఫర్ కేవలం నేటి వరకు మాత్రమే అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ గత నెలలోనే అద్భుతమైన రాయితీలను అందించగా టాటా టియాగో మోడల్ పై ఏకంగా 15 వేల రూపాయల రాయితీ ఇచ్చింది. దీనితోపాటు ఏదైనా పాత కారుని ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే మరో పది వేలు కూడా అదనపు రాయితీ గా ప్రకటించింది టాటా గ్రూప్. అలాగే టాటా గ్రూప్ సంస్థల్లో పనిచేసే వారైతే వారికి అదనంగా మరో 10 వేల రూపాయలు కూడా డిస్కౌంట్ ఈ కారు పై ఇచ్చింది. ఇక ఇదే నేపథ్యంలో covid -19 కొరకు పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు ఐదువేల రూపాయలను డిస్కౌంట్ ఇచ్చింది టాటా సంస్థ.
ఇక మరోవైపు టాటా హ్యారియర్ పై 30 వేల వరకు రాయితీని ప్రకటించింది కంపెనీ. అయితే ఈ కార్ ఆటోమేటిక్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే మరోవైపు ఎక్స్చేంజ్ స్కీమ్ కింద 30 వేల రూపాయల అదనపు రాయితీ కూడా అందజేసింది.