ఎగుమతులు పెంచేందుకు కసరత్తు చేస్తున్న బజాజ్ ఆటో..!

Suma Kallamadi

భారతీయ ఆటో దిగ్గజం బజాజ్ కంపెనీ కరోనా మహమ్మారి కారణంగా తమ వాహనాలను అధిక సంఖ్యలో విక్రయించలేకపోతుంది. బజాజ్ ఆటో కంపెనీ జనవరి నుండి జూన్ వరకు కేవలం 5,89,000 ద్విచక్ర వాహనాలను విక్రయించగా... ఇతర దేశాలకు 6,64,000 ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. స్వస్థలమైన భారతదేశంలో కరోనా మహమ్మారి కారణంగా, లాక్ డౌన్ కారణంగా తమ విక్రయాలు దెబ్బతిన్నాయని కానీ ఎగుమతుల కారణంగా తమ సంస్థ మళ్లీ పుంజుకుంటుందని బజాజ్ కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఆటో రిక్షా వాణిజ్యపరమైన వాహనాలను కూడా విక్రయించే బజాజ్ ఆటో సంస్థ చాలా ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశీయ ఎగుమతుల మార్కెట్ల పై కరోనా మహమ్మారి ప్రభావం బాగానే పడిందని కానీ విదేశాల్లో వాహనాల విక్రయాలు బాగానే జరుగుతున్నాయని బజాజ్ ఆటో సంస్థ అధికారి సౌమిన్ రే చెప్పుకొచ్చారు. 


తమ వాహనాల పరికరాలను అమర్చే అసెంబుల్ ప్లాంట్ ని బ్రెజిల్ దేశంలో 18 నెలల లోపు నిర్మిస్తున్నామని బజాజ్ ఆటో కంపెనీ తెలిపింది. ఆసియా ఖండంలో తమ మార్కెట్ బాగా పెంచుకునేందుకు కంపెనీ కార్యక్రమాలను నిర్వర్తించేందుకు థాయిలాండ్ లో, యూరప్ లో డిజైన్ ఆఫీసులను నిర్మించబోతున్నామని బజాజ్ సంస్థ తెలిపింది. మొత్తం తయారైనా ద్విచక్ర వాహనాల్లో 40 నుండి 45 శాతం ఎగుమతి అవుతున్నాయని సౌమిన్ రే వెల్లడించారు. 


ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో బజాజ్ ద్విచక్ర వాహనాలు భారీ సంఖ్యలో విక్రయించబడుతున్నాయి. అయితే విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధించడంతో బజాజ్ సంస్థ ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కరోనా మహమ్మారి సోకి తుందన్న భయంతో ఉద్యోగస్తులు కూడా ఆఫీసులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం భారతదేశంలో అంతర్గతంగా లాక్ డౌన్ దాదాపు పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో బజాజ్ ఆటో షేర్లు మార్కెట్లలో కూడా మెరుగ్గా ఉంది. ప్రస్తుతం బజాజ్ కంపెనీ షేరు 3030 వద్ద ట్రేడవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: