వెహికల్ సర్వీస్ సెంటర్ ప్రారంభం : ఇసుజు మేనేజింగ్ డైరెక్టర్

Kothuru Ram Kumar
జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ భారత్ లో ఓ కొత్త సర్వీస్ సెంటర్ ను ప్రారంభించింది. అహ్మదాబాద్ లో ఇసుజు మోటార్స్ సంస్థ వెహికల్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. దీని కోసం టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్ (టీఏఎస్ఎల్) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సర్వీస్ సెంటర్ టీఏఎస్ఎల్ నుంచి ఆటోమోటివ్ ఆప్టర్ మార్కెట్ సొల్యూషన్స్ కూడా చేయనుంది.

ఈ సేవలు కేవలం ఇసుజు వినియోగదారులకే పరిమితం కాకుండా దేశంలోని (ఎనీ మేక్, ఎనీ మోడల్) వాహనాలకు కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. సర్వీస్ సెంటర్ లో కేవలం కార్ల సర్వీసులే కాకుండా కారు పార్టులను కూడా తయారు చేస్తారని, కస్టమర్లు తమకు కావాల్సిన కారు పార్టులను తయారు చేసుకునే సౌకర్యం ఉందని కంపెనీ పేర్కొంది.

ఇసుజు తమ సేవలను మెరుగుపర్చుకునేందుకే టీవీఎస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పరిశ్రమలోనే మొదటిసారిగా  అదనపు సామర్థ్యం కలిగిన ఇజుసు ‘మైటివీఎస్’ ఫ్రాంచైజీలను కూడా అందించనుంది. ఈ సౌకర్యాలు మొదట్లో కేవలం ఇసుజు కస్టమర్లకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు భాగస్వామ్య సంస్థలకు సైతం కల్పించనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కెన్ తకాషియా వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ..‘‘ ఇసుజు కారు సౌకర్యాలు మరింత పెంచాం. అత్యాధునిక టెక్నాలజీతో కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాం. ఇసుజు కస్టమర్లకే పరిమితమైన సేవలు ఇప్పుడు అందరికి అందుబాటులో ఉండబోతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేయడంతో కారు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

ఇతర కార్ల బ్రాండ్ల వినియోగదారులతో కూడా సత్సంబంధాలు నెలకొనేలా ప్రయత్నాలు ప్రారంభించాం. భారత దేశంలో మల్టీ బ్రాండ్ సర్వీసెస్ ను అందించడానికి టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్ తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. కంపెనీ సహకరించడంతో ఇసుజు సంస్థతో కలిసి ‘మైటీవీఎస్’ కస్టమర్లకు సౌకర్యవంతమైన, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వాహనాలను అందించనుంది.’’ అన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెన్ తకాషిమా వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: