త్రీ వీలర్ స్కూటర్ ప్రారంభించిన ప్యుగోట్ మోటార్ సైకిల్..!
ఫ్యూగోట్ మోటార్ సైకిన్ ను మహీంద్రా కంపెనీ ద్విచక్ర వాహన విభాగాలను 2019లో కొనుగోలు చేసి ఈ స్కూటర్ ను ఆవిష్కరించారు. అయితే మొట్టమొదటి సారిగా ఫ్యూగోట్ స్కూటర్ ను ఫ్రాన్స్ లో మాత్రమే విడుదల చేసింది. మార్కెటింగ్ డిమాండ్ ను బట్టి భవిష్యత్ లో భారత మార్కెట్ లో కూడా ఫ్యూగోట్ ను రిలీజ్ చేయవచ్చు. 400 ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ బైక్ 35 బీహెచ్ పీ పవర్,38 ఎన్ఎమ్ టార్క్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ వెల్లడించింది.
ఫ్యూగోట్ స్యూటర్ లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబీఎస్)ను ఏర్పాటు చేశారు. దీంతో మనం ఈ స్కూటర్ పై ఎంత వేగంగా ప్రయాణించినా స్పాట్ లో నిలిపివేయవచ్చు. స్యూటర్ మోడల్ ప్రత్యేకంగా ఉండటంతో పాటు దూకుడును కనబరిచే శైలీని కలిగి ఉంది. ముందు భాగంలో రెండు టైర్లను ఏర్పాటు చేయడంతో స్కూటర్ లీన్ యాంగిల్ ను కలిగిస్తుంది.
ఈ స్కూటర్ ముందు భాగం కూడా చాలా వెడల్పుగా కనిపిస్తుంది. దీనికి కారు తరహా మోడల్ గా తయారీ చేసినట్లు అనిపిస్తుంది. స్కూటర్ కు రెండు హెడ్లైట్లు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ఎల్ఈడీ లైటింగ్ ను ఏర్పాటు చేశారు. 400 సీసీ సామర్థ్యం ప్రకారం ఇలాంటి పవర్ ఫుల్ స్కూటర్ ఇప్పటివరకూ అందుబాటులో రాలేదని మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్వీటర్ ఖాతాలో తెలిపారు.