భారత్‌లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా థార్.. ధర ఎంతో తెలుసా..?
ఈ ఏడాది మహీంద్రా సంస్థ విడుడల చేసిన థార్ టార్ వేరియంట్ ధర రూ.12.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) ద్వారా పొందవచ్చు. దేశవ్యాప్తంగా కంపెనీలు డీలర్ షిప్ లు మరియు ఆన్ లైన్ ద్వారా ఈ కారును బుకింగ్ చేసుకునే సదుపాయం కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. మహీంద్రా థార్ 2020 మోడల్ కార్ ని యూనిట్ వేలం పాటలో గెలిచిన వ్యక్తి ఇవ్వడం జరిగింది. అయితే మహీంద్రా తమ వినియోగదారులకు మహీంద్రా థార్ మోడల్ ను నవంబర్ 1వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.
మహీంద్రా థార్ టెస్ట్ డ్రైవ్ ను దేశంలోని 20 నగరాల్లో ప్రారంభించింది. త్వరలో మరో 100 కొత్త నగరాల్లో పారంభం కానునట్లు సంస్థ వెల్లడించింది. మహీంద్రా థార్ డిజైన్ దాదాపు పాత మోడల్ కార్ల మాదిరిగానే ఉంటందని, దీనికి 7 స్లాట్ గ్రిల్స్ లను ఏర్పాటు చేశారు. ఈ కార్ ముందుభాగంలో ఎల్ఈడీ హెడ్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్లను ఏర్పాటు చేశారు. వెనుకభాగంలో ఎల్ఈడీ టై లైట్లు ఏర్పాటు చేశారు. అయితే పాత మోడల్ కార్లతో పోల్చితే మహీంద్రా థార్ మోడల్ కారు ప్రత్యేక ఆకర్షణీయతను కలిగిఉంది.
మహీంద్రా థార్ మోడల్ కారులో రెండు ట్రిమ్స్ ఏఎక్స్, ఎల్ఎక్స్ మోడల్ లను కలిగి ఉంది. ఏఎక్స్ మోడల్ కారులో పెట్రోల్, డీజిల్ లతో పాటు మాన్యువల్ గేర్ బాక్సును ఏర్పాటు చేశారు. పెట్రోల్ ఇంజిన్ లో ఆటోమెటిక్ గేర్ బాక్స్ ను, ఆటోమెటిక్ డీజిల్ మాన్యువల్ ను పొందుపర్చారు.