గుడ్ న్యూస్: రూ.60 వేలు చెల్లించి స్విఫ్ట్ డిజైర్ సొంతం చేసుకోండి..!

Kothuru Ram Kumar
మీరు కారు కొనుకోవాలనే ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. మార్కెట్లోని పలు సెడాన్ కార్ల కంటే కూడా మారుతి డిజైర్ చక్కటి ప్రజాదరణ పొందుతోంది. ఈ కారు ఇప్పటికే మార్కెట్లో మంచి సేల్స్ తో దూసుకుపోయింది. మారుతి డిజైర్ కారు మార్కెట్లో రూ. 5.89 లక్షల నుంచి ప్రారంభవుతోంది.

అయితే ఇంజిన్, ట్రాన్స్మిషన్ మారుతి 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో 90 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే డిజైర్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కార్లలో ఎకానమీ కారుగా గుర్తింపు ఉంది. ఇక ఇది 5-స్పీడ్ మాన్యువల్‌తో రోడ్లపై రయ్ మంటూ పరిగెత్తనుంది. దీనిపై 5-స్పీడ్ AMT ఎంపికను పొందవచ్చునని నిపుణులు తెలిపారు. MT తో 23.26kmpl, AMT తో 24.12kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఇక Dzire నాలుగు వేరియంట్లలో అందించబడుతోంది. L, v, Z, Z +. ఇది v వేరియంట్ నుండి AMT ఎంపికతో లభిస్తుందన్నారు. క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌విఎంలు, పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్, వెనుక ఎసి వెంట్స్‌తో ఆటో ఎసి వంటి ఫీచర్లతో మారుతి ఫేస్‌లిఫ్టెడ్ డిజైర్‌ను కలిగి ఉందన్నారు.

అయితే డిజైర్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లతో వస్తుందన్నారు. దీని AMT వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ హోల్డ్ అసిస్ట్ లభిస్తాయన్నారు.  అయితే రియర్-వ్యూ కెమెరా, రియర్ డిఫోగర్ వంటి ఫీచర్లు హై-స్పెక్ వేరియంట్లలో అందించబడతాయని తెలిపారు.

ఇక మారుతి డిజైర్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోని హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టైగర్, ఫోర్డ్ ఆస్పైర్ వంటి కార్లను గట్టి పోటీని ఇస్తోందన్నారు.. ఇక ఈ కారును ఎక్స్ షోరూం ధరలో 10 శాతం చెల్లిస్తే చాలు మీరు కారును ఇంటికి తీసుకెళ్లి పోవచ్చు. అందుబాటులో ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా చూసినట్లయితే కనిష్టంగా 8 వేలకే ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ కారును కస్టమర్ల నుంచి మంచి అప్రిషియేషన్ పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: