మరో కొత్త మోడల్ తో భారత్ మార్కెట్ లలో రానున్న పల్సర్ బైక్స్..
గతంలో వచ్చిన డిస్క్ బ్రేక్ వేరియంట్ తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న బండి ధర తక్కువ అని బజాజ్ సంస్థ వెల్లడించింది. బైకు ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ కొత్త మోడల్ ధర కేవలం రూ. 73.274 మాత్రమే.. అయితే డిస్క్ బ్రేక్ వేరియంట్ బండి కన్నా 7వేల రూపాయలకు తక్కువలో లభిస్తుందని బజాజ్ యాజమాన్యం పేర్కొన్నారు.
ఇక ఈ బైకు ప్రత్యేకతల విషయానికొస్తే..125 స్ప్లిట్-సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ బైకులో రెండు పిల్లియట్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, ట్యాంకు ష్రౌడ్లు, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, 11.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంకు, బ్లాక్డ్ అవుట్ మస్కూలర్ లుకింగ్ ఎక్సాహాస్ట్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్ తో పాటుగా ఇంజిన్ కౌల్ ను కలిగి ఉంది.ఇవి కాకుండా ఈ బండికి మరి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయట.. ఎయిర్ కూల్డ్ 124.4సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్ కలిగి ఉండి 11.3 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 10.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్ లో ప్రస్తుతం ఈ బైకులకు పోటీగా హీరో గ్లామర్ ఉన్నా కూడా యువత పల్సర్ ను కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతుందటం గమనార్హం..