హోండా కార్ల పై భారీ తగ్గింపు.. ఎంతంటే..?

Satvika
కార్ల కంపెనీలో చాలా రకాల కొత్త కార్లు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. దసరా ,దీపావళి పండుగల సందర్బంగా ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త టెక్నాలజీ తో ఎన్ని రకాల కంపెనీల కార్లు మార్కెట్ లోకి రానున్నాయి. ముఖ్యంగా హోండా కంపెనీ బైక్ లతో పాటుగా కార్లను కూడా ఆవిష్కరిస్తుంది అనే విషయం తెలిసిందే.. ఈ మేరకు ఇప్పుడు హోండా కార్లపై భారీ తగ్గింపును అందించ నుందని తెలుస్తుంది... మరి ఆ కార్లు వాటి ప్రత్యేకతలు, వాటి అద్భుతమైన ధరలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..



ఇటీవల కాలంలో భారత మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ హోండా కార్లను గురించి ఇప్పుడు మరో వార్త వినపడుతుంది.. అదేంటంటే మరింత కార్ల రేటును తగ్గించనిన్నట్లు సమాచారం అదేంటో , ఎంతవరకు ఈ కార్లను తగ్గిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. గత నెల జూలై లో కొత్త కార్లను విడుదల చేశారు. హోండా సివిక్, హోండా సిటీ, హోండా అమేజ్ లాంటి టాప్ మోడళ్లు కూడా ఉన్నాయి. గరిష్ఠంగా 1.6 లక్షల రూపాయల వరకు ప్రయోజనాన్ని అందించింది హోండా సంస్థ. ఈ రాయితీల్లో వినియోగదారులు ఎంచుకునే మోడళ్లు, వేరియంట్ల ఆధారంగా తేడాలున్నాయి అని అనుకుంటున్నారు.



హోండా అమేజ్ పై ఈ సంస్థ 27 వేల రూపాయల వరకు రాయితీని ప్రకటించింది. ఈ కాంపాక్ట్ సెడాన్ కు చెందిన అన్ని వేరియంట్లకు ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత కారుపై ఎక్స్ ఛేంజ్ చేసుకుంటే వారంటీని పొడిగించడమే కాకుండా అదనంగా 15 వేల రూపాయల వరకు క్యాష్ బోనస్ ను ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.. హోండా సిటీ కారుపై మొత్తం రూ.1.6 లక్షల వరకు రాయితీ ప్రకటించింది. వేరియంట్ల ఆధారంగా ఈ డిస్కౌంటులో వ్యత్యాసముంచింది. ఎస్వీ, ఎంటీ, వీ, ఎంటీ వేరియంట్లపై దాదాపు 15 వేల రూపాయల వరకు రాయితీని ప్రకటించింది. మిడ్ స్పెక్ వీ సీవీటీ ట్రిమ్ పై 51 వేల రూపాయల వరకు ప్రయోజనాలను కల్పిస్తుంది.ఇదే విధంగా హోండా సివిక్ పై  ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది.. గత జూలై లో అమలు చేసిన ఆఫర్ల తో పోలిస్తే ఈ సారి భారీ డిస్కౌంట్ ఇస్తారని కంపెనీ వెల్లడించింది.  మరి దీపావళికి తగ్గిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: