బెంజ్ లో మరో కొత్త ఫీచర్లతో కారు లాంఛ్.. ధర ఎంతంటే?

Satvika
బెంజ్ కారు అంటే జబర్దస్త్ అంతే.. రిచ్ గా ఉండటంతో పాటుగా అధ్బుతమైన ఫీచర్లు, క్లాస్ లుక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఎంతైనా బెంజ్ బ్రాండ్ కు ఉన్న ఫేమ్ వేరనే చెప్పాలి.. అందుకే రిచ్ కిడ్స్ అందరూ కూడా బెంజ్ కారులో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు ఇండియా లో బెంజ్ కారు మరొక కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. మెర్సిడెజ్ బెంజ్ నుంచి కొత్త కారు వస్తుందంటే వాహన ప్రియుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తాజాగా మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 కూపేను భారత మార్కెట్లో విడుదల చేసింది. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా బెంజ్ సంస్థ ద్వారా దేశంలో విడుదలవుతున్న తొలి కారు ఇదే కావడం విశేషం.




ప్రస్తుత మార్కెట్ లో ఈ బెంజ్ కారు ధర కేవలం రూ.76.70 లక్షలుగా సంస్థ వెల్లడించింది..ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కారుకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటిని ప్రత్యేకంగా బుక్ చేసుకొని కొనుగోలు చేసేందుకు అన్నీ రకాల సైట్లు అందుబాటులోకి వచ్చాయి..ఏఎంజీ జీఎల్సీ 43 కూపే మోడల్ బ్రాండ్ సిగ్నేచర్ పాన్ అమెరికన్ గ్రిల్ తో పాటు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ను ప్రత్యేకంగా కలిగి ఉంటుంది.  వీటితో పాటుగా ఎయిర్ వెంట్స్ సదుపాయం కూడా ఉంటుంది.




ఈ కారు ప్రత్యేకతలు అంటే బాహ్యంగా కనిపించే వస్తువులే.. ఉదాహరణకు టైర్లు, లైట్లు , సీట్లు అన్నీ కారుకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నాయి.లీటర్ వీ6 పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 390 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 520 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఆల్ ఫోల్ వీల్స్ 4 మ్యాటిక్ సిస్టంతో పనిచేస్తుంది.మల్టిపుల్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, విభిన్న రకాల డ్రైవింగ్ మోడ్లు, వెంటిలైజ్డ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, హెడ్స్ అప్ డిస్ ప్లే, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు మొదలగు ప్రత్యేక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.. మొత్తానికి కారు కు వస్తున్న రేటింగ్ మాత్రం జబర్దస్త్ అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: