టీవీఎస్ లో మరో కొత్త మోడల్ బైక్ లాంఛ్.. ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలు..

frame టీవీఎస్ లో మరో కొత్త మోడల్ బైక్ లాంఛ్.. ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలు..

Satvika
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది..దేశ వ్యాప్తంగా ఈ కంపెనీ నుంచి వచ్చిన వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుంది.. నాణ్యత , తక్కువ ధరలో లభించడం తో కష్టమర్లు వీటిని కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా కొత్త ఫీచర్లు ఉన్న బైకు లను మార్కెట్ లోకి వదులుతుంది..తాజాగా మరో కొత్త మోడల్ బండిని మార్కెట్ లోకి లాంఛ్ చేస్తుంది.

ఆ బైకు వివరాల విషయానికి వస్తే.. అదే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ మోటార్ సైకిల్. 2021 ఎడిషన్ కు చెందిన ఈ బైక్ ధర వచ్చేసి ఎక్స్ షోరూంలో రూ.1.31 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, అప్డేట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. రైడర్ అసిస్ట్ టెక్నాలజీ దీనికి అదనంగా అందించారు. ఈ మోడల్ బండి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ ఛానెల్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. బేస్ వర్షన్ సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ధర వచ్చేసి రూ.1.25 లక్షలు కాగా.. డ్యూయల్ ఛానెల్ రూ.1.31 లక్షలుగా ఉంది. అయితే డ్యూయల్ ఛానెల్ వేరియంట్ లిమిటెడ్ మోడళ్లనే మార్కెట్ లోకి విడుదల చేసింది టీవీఎస్..

ఈ సరికొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ మోడల్ మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ తో పాటు అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ తో పాటు నూతన కలర్ స్కీములతో అందుబాటులోకి వచ్చింది. ఈ బండి కోసం బుకింగ్ లను ప్రారంభించారు.. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు టీవీఎస్ కంపెనీ. ఈ బైకు వేగం అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ గంటకు గరిష్ఠంగా 127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.. దీపావళికి ఈ బైకు ధర తగ్గుతుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: