ఈ టెకో ఎలక్ట్రా విద్యుత్ స్కూటర్ కు అంత డిమాండ్ ఎందుకో తెలుసా..

Satvika
ప్రస్తుతం డీజిల్ , పెట్రోల్ ధరలు మండిపోవడంతో అందరూ ఎలక్ట్రానిక్ స్కూటర్లు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు కూడా అధ్బుతమైన ఆఫర్లతో పాటుగా సరసమైన ధరలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. విద్యుత్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది..తాజాగా పుణెకు చెందిన ఎలక్ట్రిక్ట్ టూ-వీలర్ల తయారీ సంస్థ టెకో ఎలక్ట్రా సరికొత్త సాథీ మోపెడ్ విద్యుత్ స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ముందు వెనక సరుకులు పెట్టుకునేందుకు వీలుగా లగేజీ ర్యాక్ తో అందుబాటులోకి వచ్చింది..

ఈ స్కూటర్ ధర కేవలం రూ.57,697లుగా సంస్థ నిర్ణయించింది.. ఈ స్కూటర్ ప్రత్యేకతలు విషయానికొస్తే.. లగేజ్ ర్యాక్ తో పాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాకుండా ఈ స్కూటర్ ఫ్లాట్ సీటును కలిగి ఉండి ఒకే ఒక్కరు సౌకర్యవంతంగా కూర్చొనే సౌలభ్యం ఇందులో ఉంది. ఈ సాథీ మోపెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, టెయిల్ ల్యాంపులు, స్మార్ట్ రీపేర్ ఫంక్షన్, ఫాస్ట్ ఛార్జింగ్ వీటితో పాటుగా మరి కొన్ని ప్రత్యేకతలు అందుబాటులో ఉన్నాయి. రెండు నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన ఆ బైక్ లకు మార్కెట్ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది..

ఇక బైక్ ఛార్జింగ్ విషయానికొస్తే.. ఒకసారి ఫుల్ గా ఛార్జింగ్ పెడితే నిర్విరామంగా 60 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. ఈ వాహనం బీఎల్డీసీ బ్రష్ లెస్ డీసీ హబ్ మౌంటెడ్ మోటార్ 48 వోల్టుల 26 ఏహెచ్ లిథియం బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. 100 శాతం ఛార్జింగ్ కేవలం 3 నుంచి 4 గంటల సమయంలోపే ఎక్కుతుంది.. మరో ముఖ్య విషయమేంటంటే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ కోసం 1.5 యూనిట్ల కరెంటు ను మాత్రమే వినియోగించుకుంటుంది.. దాదాపు 60 కిలో మీటర్ల దూరం వెళ్ళడానికి 12 రూపాయలు ఖర్చు అవుతుంది.. ఇదండీ ఈ స్కూటర్ ప్రత్యేకతలు.. అందుకే వీటికి మార్కెట్ లో భారీ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: