హోండా రెప్సాల్ ఎడిషన్ మోడళ్లు లాంఛ్.. వావ్ రేసింగ్ ప్రియులకు గుడ్ న్యూస్..
ఈ వాహనాల డిజైన్ విషయానికొస్తే .. హోండా 2.0, హోండా డియో మోడళ్లు లిమిటెడ్ ఎడిషన్ వర్షన్లు భారత మార్కెట్లో దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఈ మోటార్ సైకిళ్ల డెలివరీలను సంస్థ అందజేయనుంది. ఈ రెండు టూ-వీలర్లకు రెప్సాల్ హోండా రేసింగ్ టీమ్ ను ఆదర్శంగా చేసుకొని గ్రాఫిక్స్ ను రూపొందించారు. ఈ రెండు రకాల మోడల్ బైక్ లు డిజైన్లు వైబ్రెంట్ ఆరెంజ్ వీల్ రిమ్స్, యాక్సెంట్రేట్ డిజైన్ థీమ్ లను ప్రత్యేకంగా కలిగి ఉన్నాయి..
ఈ బైకుల లో మరి కొన్ని కొత్త మార్పులను చేశారు.. మిగిలిన అన్నీ ఫీచర్లను అలానే ఉంచారు..కాగా కొత్తగా వచ్చిన వాటిలో మార్పులను చూస్తే..184 సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉండి 17 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 16.1 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.స్కూటర్ విషయానికొస్తే..109సీసి సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.. ప్రస్తుతం ఈ బైక్ లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి.. కొనుగోలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని హోండా కంపెనీ యాజమాన్యం తెలిపింది..