టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న మహీంద్ర ఎక్స్‌యూవీ 300..

Satvika
మహీంద్రాకార్లకు మార్కెట్. మంచి డిమాండ్ ఉంది. భారత్‌లో తయారయ్యే మహీంద్ర ఎక్స్‌యూవీ 300కి ఆఫ్రికన్‌ మార్కెట్‌లో అరుదైన ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ లభించింది. దక్షిణాఫ్రికాలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలివాహనంగా మహీంద్ర ఎక్స్‌యూవీ 300 నిలిచింది. ఈ వాహనంలో డ్రైవర్‌ తో పాటు ముందు సీటులో ప్రయాణించే పాసింజర్‌లకు ఎయిర్‌ బ్యాగ్స్‌తో పాటు, పిల్లల కోసం ఐసోఫిక్స్‌ మౌంట్స్‌, సీట్‌బెల్ట్‌ ప్రీ-టెన్షనర్స్‌, యాంటీ లాంక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌లు స్టాండర్డ్‌ ఫిట్‌మెంట్స్‌ గా వచ్చాయి..



ఈ కారును మనుషుల అవసరాల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్లోబల్‌ ఎన్‌సీఏపీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందువరసలో కూర్చునే పెద్దల భద్రతలో ఎక్స్‌యూవీ 300కు మొత్తం 17కు గాను 16.42 స్కోర్‌ లభించింది. దీనికి తోడు ఎక్స్‌ యూవీ ౩౦౦ బాడీ పటిష్టంగా ఉండటంతో పాటు మరింత లోడింగ్‌కు అనువుగా ఉంది.వాహనం పిల్లల భద్రత విషయంలో 44కు 37.44 స్కోర్‌ సాధించింది. దీంతో కారును కొనడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ధర కూడా జనాలకు అందుబాటు లో ఉండటం తో సేల్స్ కూడా మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయింది. ఈ మేరకు కంపెనీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 



మహీంద్రా నుంచి వచ్చిన అన్ని కార్లలో ఈ కారు చాలా ప్రత్యేక అని చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మోడల్ అందరికి అందుబాటులో ఉన్న నేపథ్యం లో వీటిని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందిన మొట్ట మొదటి కారుగా మహీంద్ర ఎక్స్‌ యూవీ 300 నిలిచింది. ఈ వాహనంలో డ్రైవర్‌ తో పాటు ముందు సీటులో ప్రయాణించే పాసింజర్‌లకు ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు, పిల్లల కోసం ఐసోఫిక్స్‌ మౌంట్స్‌, సీట్‌బెల్ట్‌ ప్రీ-టెన్షనర్స్‌, లాంటి మొత్తం ఫీచర్లతో తో  కారు మార్కెట్ లో సందడి చేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: