భారతీయ మార్కెట్ లో సందడి చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు..

Satvika
భారతీయ మార్కెట్లో ఎలెక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి.. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్ లో కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. వాటికి ఉన్న ఫీచర్స్ వల్ల మార్కెట్లో డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ఖర్చుల కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మార్కెట్లో అందుబాటులో చాలా ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్‌లోకి ఎంజి మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌, యమహా వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకొచ్చాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం..


యమహా ఎఫ్‌జెడ్‌ మోటర్‌సైకిల్స్‌.. 


మొనగాడు బండి అంటే యమహా.. ఈ కంపెనీ జపాన్ కు సంబందించినది..ఈ యమహా తాజాగా తమ ఎఫ్‌జెడ్‌ మోటర్‌ సైకిల్స్‌ సిరీస్‌లో కొత్త శ్రేణిని ఆవిష్కరించింది. వీటి ధర రూ. 1,03,700 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త ఎఫ్‌జెడ్‌ సిరీస్‌లో ఎఫ్‌జెడ్‌ ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్‌ఎస్‌, ఎఫ్‌ఐ మోడల్స్‌ ఉన్నాయి. బీఎస్‌6 ఇంజిన్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌ స్విచ్‌, ఏబీఎస్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ వంటి ఫీచర్లతో ఇవి తేలికగా ఉంటాయని సంస్థ తెలిపింది. మోటర్‌సైకిల్‌ బరువును 137 కేజీల నుంచి 135 కేజీలకు తగ్గించినట్లు వివరించింది. ధర రూ. 1,03,700 నుంచి ప్రారంభం అవుతుంది..


జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌.. ఐ-పేస్‌ ..


ఈ కారు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి.. వీటికి డిమాండ్ తో పాటుగా ధర కుడా ఎక్కువే..జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వాహన తయారీ సంస్థ మార్చి 9న జాగ్వార్‌ ఐ-పేస్‌ మోడల్‌ను భారత్‌లోకి తీసుకొస్తుంది.696 ఎన్‌ఎం టార్క్‌, 4.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. 80కిపైగా అంతర్జాతీయ అవార్డులను ఈ కారు సొంతం చేసుకుంది. ఇది ఒక ఎలెక్ట్రిక్ కారు..


ఎంజి మోటార్స్‌ కారు..

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలలో ఒకటి ఈ కార్లు.. ఇప్పటికే ఎన్నో రకాల కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. అవి మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. ఇప్పుడు మరో ఎలెక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది.44.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో ఒకసారి చార్జీ చేస్తే 419 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 143 పీఎస్‌ పవర్‌, 350 ఎన్‌ఎం టార్క్‌, 8.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 17 అంగుళాల అలారు వీల్స్‌, పీఎం 2.5 ఎయిర్‌ ఫిల్టర్‌ ఏర్పాటు ఉంది. 31 నగరాల్లో బుకింగ్స్‌కు జెడ్‌ఎస్‌ 2021 వర్షన్‌ అందుబాటులో ఉంది. ఇక ధర విషయానికొస్తే.. ఈ కారు ధర ఢిల్లీ షో రూం లలో 20.99 లక్షలు ఉన్నట్లు కంపెనీ నిర్ధారించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: