ఈ స్కూటర్ కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలో మీటర్లు ప్రయాణం చేయొచ్చట..!

Satvika
ఎలెక్ట్రానిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ వీటి పై మొగ్గు చూపుతున్నారు. అందుకే కంపెనీలు కూడా వీటిని కొత్త హంగులతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. వాటికి డిమాండ్ పెరగడంతో పాటుగా కంపెనీల సేల్స్ కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ హీరో కూడా వాహనదారుల అభిరుచులకు తగ్గట్లు కొత్త స్కూటర్లు మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.

హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ హీరో ఎలెక్ట్రిక్ స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,540. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. ఇందులో ఆప్టిమా హెచ్ ఎక్స్, నిక్స్ హెచ్ ఎక్స్, ఫోటాన్ హెచ్ ఎక్స్ అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చూడటానికి అన్నిటికంటే పొడవుగా చాలా భిన్నంగా ఉన్నాయి. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా వీటిని తయారు చేశారు. స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంది..

అయితే ఈ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే, 85నుంచి200 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు.82 కిలోమీటర్లు వెళ్తే టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో నిక్స్ హెచ్ ఎక్స్ హై స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. అంటే ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. వెనక రైడర్‌కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. 1.536 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే డౌన్ పేమెంట్ రూ.4999 ఉంది. వడ్డీ రేటు రూ.6.99గా నిర్ణయించింది కంపెనీ.. ఈ స్కూటర్ పై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కంపెనీ వెబ్ సైట్ ను చూడవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: