ఆడి నుంచి మార్కెట్ లో సందడి చేస్తున్న మరో కారు ఇదే..

Satvika
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ప్రస్తుతం వాహన ప్రియుల ఆలోచనలకు తగ్గట్లు సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి. మామూలు కార్లతో పోలిస్తే లగ్జరీ కార్లను వరుసగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అలాంటి విలాస వంతమైన కార్లలో ఒకటి ఆడి.. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంటుందని అందరికీ తెలిసిందే. కాగా, ఇప్పుడు మరొక కారును లాంఛ్ చేసింది. విడుదల అవ్వగానే ఆ కారు సేల్ కూడా భారీగానే ఉన్నాయి.


ఆడీ భారత్‌లో కొత్త ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ కారును సోమవారం విడుదల చేసింది. లగ్జరీ సెడాన్‌ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ధరను రూ.79.06 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఎస్‌5 స్పోర్ట్‌ బ్యాక్‌ను 2017లోనే భారత్‌కు తీసుకొచ్చారు. తాజాగా దీనిలో మరిన్ని అత్యాధునిక ఫీచర్లు జోడిండచడంతో పాటు ఔటర్‌ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కారు మరింత స్పోర్టీ లుక్‌ను సంతరించుకుంది. షార్పర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు అదనపు ఆకర్షణ. యాంగులర్‌ బంపర్‌, క్వాడ్‌ టిప్‌ ఎగ్జాస్ట్‌లు, 19 అంగుళాల అలాయ్ వీల్స్‌, స్పాయిలర్‌తో పాటుగా కొత్త ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.


12.2 అంగుళాల డిజిటల్‌ ఎంఐడీ తెర, ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్ వీల్‌ ఈ కారులో ఉన్నాయి. 3.0 ట్విన్‌ టర్బో, వీ6 పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 354 హెచ్‌పీ శక్తిని, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 8-స్పీడ్‌ ట్రిప్‌ట్రోనిక్‌ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. 4.8 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించొచ్చు. డైనమిక్‌, కంఫర్ట్‌, ఎఫీషియెన్సీ, ఆటో, ఇండివిడ్యువల్‌ అనే ఐదు డ్రైవింగ్‌ మోడ్‌లు వీటిలో ఉన్నాయి. మెర్సిడెస్‌-ఏఎంజీ సీ 43, మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌సీ 43 ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం340ఐకి కార్లు వీటికి పోటీ ఇవ్వానున్నాయి.. మొత్తానికి పాజిటివ్ టాక్ తో సేల్స్ దూసుకుపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: