తక్కువ ధరలో ఎక్కువ లాభాలు తెచ్చే వెహికల్ ఇదే..!
ముఖ్యంగా మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన మహీంద్రా జీటో చక్కటి ఫీచర్లతోనూ బడ్జెట్ ఫ్రెండ్లీగానూ మార్కెట్లోకి వచ్చింది..ప్రమాణాలకు అనుగుణంగా, ఈ బండిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ ట్రక్ ను ప్రధానంగా ట్రాన్స్ పోర్ట్ విభాగంలోనూ, చిన్న వ్యాపారులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇది డీజిల్, cng వేరియంట్లలో లభిస్తుంది. మహీంద్రా జిటో ప్లస్ వేరియంట్‌కు సింగిల్ సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్, వాటర్-కూల్డ్ ఇంజన్ లభిస్తుంది. ఇది 42 ఎన్ఎమ్ టార్క్ వద్ద 16 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది.
మహీంద్రా జిటో ఎస్ 6 డీజిల్ వేరియంట్ అదే శక్తిని 38Nm టార్క్ వద్ద కొద్దిగా తక్కువగా పొందుతుంది, ఇది 600 కిలోల రేటెడ్ పేలోడ్‌ను మోయగలదని నిపుణులు అంటున్నారు.ఆకర్షణీయమైన ఫ్రంట్ ఫేసియా, సౌకర్యవంతమైన క్యాబిన్, ఎర్గోనామిక్ సీట్లు. కార్గో బాడీ బలంగా మరియు మన్నికైన, ధృఢమైన నిర్మాణంగల చట్రం... ఇక ఈ బండి ధర విషయానికొస్తే..రూ . 3.73 - 4.34 లక్షల(ఎక్స్ షోరూం ధర)కు లభ్యం అవుతోంది. బ్యాంకులో లోన్ తీసుకొని కూడా ఈ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. డౌన్ పేమెంట్ కింద ఎక్స్ షోరూం ధరలో 10 శాతం చెల్లిస్తే చాలు. కేవలం 37 వేలు చెల్లిస్తే చాలు బండి సొంతం చేసుకోవచ్చు..