కీలక నిర్ణయం తీసుకున్న హోండా.. అసలు కారణం ఇదే..

Satvika
ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కీలక నిర్ణయం తీసుకుంది.. కంపెనీ నుంచి తయారైన కార్లలో.ఏదైనా లోపాలు ఉంటే వాటిని మళ్లీ సరిచేసి ఇవ్వడం కంపెనీ బాధ్యత. ఇప్పుడు హోండా కూడా అదే పని చేసింది.తాజాగా తరచూ పాడవుతున్న ఫ్యూయల్ పంప్‌లను మార్చడానికి.. అలాగే ఈ పంపుల వల్ల ఇంజిన్ సమస్యలు రాకుండా ఉండటానికి హొండా కంపెనీ అమెరికాలోని 761,000 వాహనాలను రీకాల్ చేసిందని హోండా మోటార్ కో వెల్లడించింది. నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వివరించిన దాని ప్రకారం హోండా సంస్థ ఇలా ఉత్పత్తుల్లో లోపం వల్ల కార్లను రీకాల్ చేయడం ఇది మొదటిసారేమీ కాదు.


అమెరికాలో 628,000 వాహనాలను కూడా విక్రయించారు. అయితే.. ఇలాంటి ఫ్యూయల్ పంపుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు, గాయాలు అయినట్లు ఇప్పటివరకూ హోండా కంపెనీకి ఎలాంటి సమాచారమూ లేదు. అయితే వీటి గురించి ఎటువంటి ఫిర్యాదులు అందక పోయిన కూడా వాటిని కంపెనీ గుర్తించి రీ కాల్ చేసిందని తెలుస్తుంది. ఆక్యూరా  హోండా రెండింటికీ సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని 2019 మోడళ్లే. మిగతా వాటిని 2020 మోడళ్లుగా కొనసాగిస్తున్నారు.


 ఆక్యూరా నుంచి ఐఎల్ ఎక్స్‌, ఎమ్ డి ఎక్స్‌, ఎమ్ డి ఎక్స్ స్పోర్ట్ హైబ్రీడ్‌, ఆర్ డి ఎక్స్‌, టిఎల్ ఎక్స్ లాంటి కొన్ని మోడళ్లు ఉన్నాయి. ఇక హోండా కార్లలోనూ కొన్నింటికి ఈ రీకాల్ వర్తిస్తుంది.2019లో కూడా ఈ సంస్థ రెండు సార్లు కార్లు రీకాల్ చేసింది. ఇందులో అర మిలియన్ వాహనాలదాకా కవర్ అయ్యాయి. ఫ్యుయల్ పంప్‌కు సంబంధించిన సమస్యల వల్ల వీటిని రీకాల్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. చాలా ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లను రీకాల్ చేస్తూ వస్తున్నారు. దాంతో ఎక్కువ మంది కస్టమర్లకు ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: