పెరుగుతున్న ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్.. టీవీఎస్ కీలక నిర్ణయం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 500-600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది.ఐక్యూబ్ మొదట బెంగళూరులో ప్రారంభమైంది. ఆ తరువాత, ఢిల్లీలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. రాబోయే కొద్ది నెలల్లోనే ముంబై, చెన్నై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ఇతర అగ్ర శ్రేణి నగరాలతో పాటు అనేక టైర్ I నగరాల్లో దీన్ని ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్స్ డిమాండ్ ఎక్కువగా ఉన్న నగరాలతో పాటుగా బ్యాటరీ ఛార్జింగ్ అందుబాటులో ఉన్న నగరాల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు.
ఒక్క టీవీఎస్ మాత్రమే కాదు చాలా కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూకుమీదున్న మరో సంస్థ ఓలా. ఈ సంస్థ ప్రస్తుతం తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇది పూర్తవ్వగానే ఏటా 10 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. వాహనాలనే కాకుండా హై-స్పీడ్ ఛార్జింగ్ స్టేషన్ల విస్తృతమైన నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. మొదటి ఏడాదిలో, 100 నగరాల్లో 5 వేలకు పైగా ఓలా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత 400 నగరాల్లో లక్షలకు పైగా ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనుంది.. ఇంకా హీరో మోటోకార్ప్, హోండా, సుజుకి, యమహా కూడా త్వరలో ఈవీ మార్కెట్లోకి రానున్నాయి.. అన్నీ కంపెల తో పోలిస్తే టీవీఎస్ మాత్రం మరో మైలు రాయిని దాటేసింది..