బిఎస్ 6 హోండా లివాపై బంపర్ ఆఫర్
ఇక ఈ సంవత్సరంలో హోండా కంపెనీ ఇప్పుడు జూన్ నెలలో హోండా లివా కస్టమర్ల కోసం రూ. 3,500 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.ఇక ఈ సూపర్ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో ఈఎమ్ఐ ద్వారా బైక్ ని కొనే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక అంతే కాకూండా మీరు క్రెడిట్ కార్డు ద్వారా కనీసం 40,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.ఇక అంతేగాక ఈ సరికొత్త హోండా లివా బైక్ కొనుగోలు చేసినప్పుడు, దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా పూర్తవుతుంది. ఇక అలాగే ఇంకో విషయం ఏమిటంటే డౌన్ పేమెంట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మీరు మీ సమీపంలో వున్న డీలర్‌షిప్‌ను లేదా ఆన్‌లైన్‌ను సందర్శించడం ద్వారా ఈ ప్రాసెస్ ని సులభంగా పూర్తి చేయవచ్చు.ఇక హోండా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ జూన్ 30 దాకా మాత్రమే చెల్లుబాటు అవుతుందట.కాబట్టి ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు 2021 జూన్ 30 లోపు కొనుగోలు చేసుకోవాలట. ఇక ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీరు మీ దగ్గర్లో ఉన్న హోండా డీలర్షిప్ సందర్శించి పూర్తి విషయాలని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.