ఇండియాలో అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరు సంపాదించిన మారుతి సుజుకి ఇండియా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధ్యతరగతి ప్రజలకు ఎంతో అందుబాటు ధరలో ఈ కార్లు ఉంటాయి. ఇక ఈ మారుతీ కంపెనీ అందిస్తున్న ఈకో వ్యాన్ అంబులెన్స్ వెర్షన్ ధరలను కంపెనీ భారీగా తగ్గించింది.ఇక ఈ మోడల్‌పై ఇప్పుడు ఎక్కువగా రూ.88,000 తగ్గింపు లభిస్తుంది.ఇక ధరల తగ్గింపు తర్వాత ఈ మోడల్ ఇప్పుడు రూ.6.16 లక్షల (ఎక్స్-షోరూమ్) రూపాయలకు లభిస్తుంది. ఇక అంబులెన్సులపై సవరించిన జిఎస్‌టి రేట్లే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇక ఇది వరకు అంబులెన్సులపై జిఎస్‌టి 28 శాతం ఉండగా, ఇప్పుడు దానిని 12 శాతానికి తగ్గించడం జరిగింది.అయితే,ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఇక్కడ తగ్గిన జిఎస్‌టి రేట్ల ఉపశమనం కేవలం సెప్టెంబర్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందట.
ఇక ఈ కొత్త కొత్త ధరలు మాత్రం తక్షణమే అమల్లోకి రానున్నాయి.ఇక అలాగే తాజా ధరల సవరణ తరువాత మారుతి సుజుకి ఈకో అంబులెన్స్ ధర రూ.6.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రూపాయలకు ముందు మాత్రం దీని ధర రూ.7.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)రూపాయలగా ఉండేది. ఇక అలాగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లో రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా మారుతి సుజుకి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.ఇక అలాగే రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి పేర్కొన్న సమాచారం ప్రకారం చూసినట్లయితే 'ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 05/2021 ప్రకారం, మారుతీ సుజుకి ఈకో అంబులెన్సులపై జిఎస్‌టి రేటు సెప్టెంబర్ 30, 2021 వరకు 28 శాతం నుండి 12 శాతానికి తగ్గించబడిందట.ఇక దీని ప్రకారం, మారుతి ఈకో అంబులెన్స్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో తగ్గింపు ఉంటుంది ఇంకా అలాగే ఢిల్లీలో వర్తించే సవరించిన ఎక్స్-షోరూమ్ ధర రూ.6,16,875 అవుతుంది' అని పేర్కొనడం జరిగింది.