ఇక చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఆటో,ఇండియా మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన సరికొత్త 'స్కోడా కుషాక్' ఎస్యూవీ కార్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.ఇక జూన్ 28వ తేదీనస్కోడా కంపెనీ ఈ కారుని భారత మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా స్కోడా కుషాక్ ఎస్యూవీ కార్ కోసం 6,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు స్కోడా కంపెనీ పేర్కొనడం జరిగింది.ఇక స్కోడా కుషాక్ ఇండియా మార్కెట్లో యాక్టివ్, యాంబిషన్ ఇంకా స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్లలో ఈ కార్ అనేది లభిస్తుంది. మార్కెట్లో ఈ కార్ ధరలు వచ్చేసి రూ.10.49 లక్షల నుండి రూ.17.59 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.ఇక ప్రారంభంలో స్కోడా కంపెనీ ఈ మోడల్‌ను 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో విడుదల చేయడం జరిగింది. కాగా, ఈ నెలలో కూడా ఇందులో మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను స్కోడా కంపెనీ ప్రవేశపెట్టనుంది.
ఇక స్కోడా కుషాక్ కార్లు కేవలం పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే లభ్యం కానున్నాయి.స్కోడా కంపెనీ ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టే విషయం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కోడా కుషాక్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించడం జరిగింది. ఇది గరిష్టంగా 110 బిహెచ్పి పవర్‌ను ఇంకా 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇక స్కోడా కంపెనీ ఈ ఎస్యూవీ కార్ లో మరింత శక్తివంతమైన 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఈ ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేయబోతుంది. ఇక ఇందులోని 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్పి పవర్‌ను ఇంకా 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.అలాగే ఈ రెండు ఇంజన్లు కూడా మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ అలాగే డిఎస్జి గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉండటం విశేషం.