మార్కెట్లో పోటీగా టాటా పంచ్ కార్.. సూపర్ ఫీచర్స్..

Purushottham Vinay
ప్రముఖ ఇండియా ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గత కొంత కాలంగా అభివృద్ధి చేస్తూ వచ్చిన మైక్రో/మినీ ఎస్‌యూవీ కార్ ని కంపెనీ ఆఫీషియల్ గా ఆవిష్కరించడం జరిగింది. ఇక గత ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన Tata HBX కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఈ సరికొత్త మినీ ఎస్‌యూవీ కార్ Tata Punch (టాటా పంచ్)ను కంపెనీ ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది.ఇక మొదటి చూపులోనే టాటా పంచ్ చూడటానికి ముందు వైపు నుండి హరియర్ , సఫారీ మోడళ్ల లాగానే ఈ కార్ అనిపిస్తుంది. కాకపోతే, ఇదొక మినీ ఎస్‌యూవీ కార్ రూపంలో ఉంటుంది.ఇక దీని మొత్తం పొడవు 4 మీటర్ల కన్నా కూడా తక్కువగా ఉంటుంది. ఇక టాటా కంపెనీ ఈ కారును కూడా తమ సరికొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించడం జరిగింది.ఇక దీని ఫ్రంట్ ఫాసియా టాటా హరియర్ ఇంకా టాటా సఫారీ మోడళ్లకి సరి సమానంగా ఉంటుంది.

ఇక కంపెనీ ఈ కారుకు మజిక్యులర్ డిజైన్‌ను అందించడం జరిగింది.అందువల్ల ఈ కార్ మంచి రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుంది.ఇక కంపెనీ ఈ మధ్య విడుదల చేసిన చిత్రం ప్రకారం, ఈ కారులో ముందు వైపు X ఆకారంలో ఉండే పెద్ద ఫ్రంట్ గ్రిల్ ఇంకా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు అలాగే సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఇంకా క్రోమ్ గార్నిష్ వంటి అంశాలు ఈ కారులో వున్నాయి.ఇక అంతేకాకుండా, ఈ కారులో నలుపు రంగులో ఉండే పెద్ద ఫ్రంట్ బంపర్ ఇంకా దానిలో ఇరువైపులా అమర్చిన గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్ ఇంకా బాడీ చుట్టూ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ అలాగే స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఇంకా డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ అలాగే రూఫ్ కలర్‌తో మ్యాచ్ అయ్యే సైడ్ మిర్రర్స్ ఇంకా సి పిల్లర్ వద్ద అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్ (కొత్త స్విఫ్ట్‌లో లాగా) వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఈ కార్ లో ఉన్నాయి.ఇక ఈ కార్ ధర 5 లక్షల నుంచి 8.5 లక్షల దాకా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: