ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా వ్యాపించి ప్రజలకు మాత్రమే కాకూండా వివిధ పరిశ్రమలకి నష్టం కలిగించాయి. అలాగే ఆటో పరిశ్రమలకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించడం జరిగింది.అయితే కరోనా మహమ్మారి కొంత తక్కుముఖం పట్టిన తర్వాత ఆటో మొబైల్ పరిశ్రమలు మెల్లమెల్లగా కోలుకుంటున్నాయి.ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమల అమ్మకాలు చాలా ఎక్కువగా దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మకాలు కొంత పెరుగుదలని సాధించాయి. ఇక వెల్లడైన కొన్ని నివేదికల ప్రకారం ఈ సంవత్సరం ఆగష్టు నెలలో ఇండియా మార్కెట్లో మొత్తం 2,59,555 యూనిట్ల కార్లను అమ్మినట్లు తెలిసింది.ఇక ఈ అమ్మకాలు మునుపటికంటే కూడా 10.9 శాతం ఎక్కువ పెరగడం జరిగింది.
ఇక ఇండియా మార్కెట్లో మారుతి సుజుకి,హ్యుందాయ్ ఇంకా టాటా మోటార్స్‌తో సహా 15 కార్ కంపెనీలు 2021 ఆగస్టు నెలలో మొత్తం 2,59,555 యూనిట్ల ప్యాసింజర్ కార్లను అమ్మడం జరిగింది.ఇక ఇందులో మారుతి సుజుకి ఎక్కువ అమ్మకాలను నమోదు చేయడం జరిగింది. మారుతి సుజుకి ఆగష్టు నెలలో మొత్తం 1,03,187 యూనిట్ల కార్లను అమ్మి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని పొందడం జరిగింది. ఇక ఇందులో మారుతి సుజుకి కంపెనీ మార్కెట్ వాటా వచ్చేసి 38.9%కి చేరడం జరిగింది. ఇక అదే సమయంలో హ్యుందాయ్ కంపెనీ 46,866 యూనిట్లను అమ్మడం జరిగింది.హ్యుందాయ్ కంపెనీ మార్కెట్ శాతం వచ్చేసి 18.1% ఉంది.ఇక ఇండియా కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ కంపెనీ గత నెలలో 28,017 యూనిట్ల కార్లను అమ్మగలిగింది.టాటా కంపెనీ మార్కెట్ వాటా వచ్చేసి 10.8 శాతానికి చేరడం జరిగింది.ఇక వీటి తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 15,886 యూనిట్లు,టయోటా కంపెనీ 12,769 యూనిట్లు, హోండా కంపెనీ 11,177 యూనిట్లు,ఇంకా రెనాల్ట్ 9,703 యూనిట్లు కార్లని అమ్మడం జరిగింది.