ఫోక్స్వాగెన్ టైగన్ బుకింగ్స్ మాములుగా లేవుగా..

Purushottham Vinay
ఫేమస్ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ volkswagen (ఫోక్స్‌వ్యాగన్) ఇండియన్ మార్కెట్లో తన volkswagen Taigun (ఫోక్స్‌వ్యాగన్ టైగన్) 2021 సెప్టెంబర్ 24 న విడుదలచేయడానికి సన్నాహాలు రెడీ చేస్తోంది. అయితే ఈ కంపెనీ ఇప్పటికే Taigun ప్రీ-బుకింగ్‌లను కూడా ఆఫీషియల్ గా ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కంపెనీ ఇప్పుడు ఈ కొత్త టైగన్ కార్ విడుదలకు ముందే దాదాపు 10,000 బుకింగ్లను స్వీకరించినట్లు సమాచారం తెలిసింది.ఇక volkswagen కంపెనీ తన కొత్త Taigun SUV కార్ ని నెలకు 5,000 నుంచి 6,000 వరకు అమ్మాలని ఒక ప్రణాళికను రెడీ చేసుకుంది.ఇక ఇందులో భాగంగానే కంపెనీ తన నెట్ వర్క్ ని బాగా విస్తరిస్తోంది. ఇక ఇప్పుడు ఈ కొత్త Taigun కంపెనీ అనేది మంచి మోడల్ అవుతుంది.ఇక ఇది అప్ డేటెడ్ ఫీచర్స్ ఇంకా పరికరాలతో నిండి ఉంటుంది.ఇక volkswagen Taigun SUV కార్ ఇండియా 2.0 వ్యూహంలో భాగంగా కొత్త MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన కంపెనీ యొక్క ఫస్ట్ మోడల్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ కంపెనీ దీనిని పూణేలోని చకన్ ప్లాంట్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
 ఇక ఇటీవల ప్రారంభించిన స్కోడా కుషాక్ కార్ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పైన నిర్మించబడటం జరిగింది. volkswagen ఇంకా Skoda ఒకే ప్లాట్‌ఫారమ్ ను పంచుకోవడం ద్వారా ఇండియాలో అనేక కొత్త కార్లను ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా విడుదల కాబొతున్నాయి.ఇక అలాగే ఈ volkswagen Taigun కార్ చాలా మంచి డిజైన్ ని కలిగి ఉంటుంది. ఇక ఈ కొత్త volkswagen Taigun  ఎక్స్టీరియర్ విషయానికి వస్తే.. ఇందులో ముందు భాగంలో క్రోమ్ ప్లేట్లతో కూడిన పెద్ద గ్రిల్ ఇంకా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఇంకా 17-ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ అనేవి ఉన్నాయి.ఇక అలాగే ఈ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ కార్ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ అలాగే మల్టీ-ఫంక్షన్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఇంకా వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, గ్లోవ్ బాక్స్ ఇంకా లెదర్ చుట్టబడిన గేర్ లివర్‌ వంటి ఫీచర్స్ ని పొందుతుంది. ఇక అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్ అలాగే యుఎస్బి ఛార్జింగ్ ఇంకా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా అనేక కనెక్టెడ్ ఫీచర్స్ ని పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: