ఈ ఏడాది వచ్చిన టాప్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే..!!
బజాజ్, యమహా, కేటీఎం, టీవీఎస్ వంటి కంపెనీలకు చెందిన స్పోర్ట్స్ బైక్స్ ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి.
1. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200:
బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైక్ పాత మోడల్ అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఈ బైక్ కోసం ఆరా తీశారట . అయితే అమ్మకాల విషయానికి వస్తే ఈ మోడల్ బైక్ పర్వాలేదని అనిపించుకుంది.200CC ఇంజిన్ సామర్ధ్యం తో 24.14bhp పవర్ అలాగే 18.7Nm టార్క్ కలిగి ఉన్న ఈ బైక్ భారత మార్కెట్లో RS200 స్పోర్ట్స్ బైక్ ధర రూ.1.63 లక్షలకు అమ్ముడుపోయింది.
2. కేటీఎమ్ ఆర్ సి 125:
సరికొత్త ఫీచర్లు ,లేటెస్ట్ అప్డేట్స్, స్టైలిష్ లుక్ రివైజ్డ్ హార్డ్వేర్ కలిగి ఉన్న ఈ ఆర్ సి 125 స్పోర్ట్స్ బైక్ భారత మార్కెట్లో చాలా ఎక్కువగా అమ్ముడుపోయింది. ఇక ఈ సంవత్సరం ఎక్కువగా అమ్ముడు పోయిన స్పోర్ట్స్ బైక్ లో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఇక భారత మార్కెట్లో ప్రస్తుతం దీని ధర రూ.1.82 లక్షలు.
3.యమహా వై జెడ్ ఎఫ్ R15 V4:
యమహా R15 ఇండియాలో లాంచ్ చేసిన రోజు నుండి ఇప్పటివరకూ విపరీతమైన జనాదరణను పొందుతోంది. ప్రధానంగా యాక్సెసిబిలిటీ, స్పోర్టినెస్ సమపాల్లో కలిగిన ఈ బైక్ యువతను ఇట్టే ఆకట్టుకోవడం గమనార్హం. ఈ బైక్ ధర రూ.1.71 లక్షల నుంచి మనకు ప్రారంభమవుతుంది.