Komaki DT 3000 : విడుదల ఇంకా పూర్తి వివరాలు!

Purushottham Vinay
ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ కోమకి ఎలక్ట్రిక్ (Komaki Electric) త్వరలోనే తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ తమ కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ "కోమకి డిటి 3000" (Komaki DT 3000) ని మార్చి 25, 2022వ తేదీన దేశీయ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ సంవత్సరం కంపెనీకి ఇది మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది. రేటు విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్లో Komaki DT 3000 ధర వచ్చేసి సుమారు రూ.1,15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉండొచ్చని అంచనా.ఇక కొత్త కోమకి డిటి 3000 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి మార్చి 25వ తేదీ నుంచి అన్ని కోమకి డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లేటెస్ట్ టెక్నాలజీని ఇంకా అలాగే ఎన్నో అధునాతన ఫీచర్లతో అభివృద్ధి చేసింది.


ఈ స్కూటర్‌లో 3000 వాట్ల బిఎల్‌డిసి (BLDC) ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఉంటుంది. ఇది 62V 52AH లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో బాగా పనిచేస్తుంది. పూర్తి చార్జ్ పై కోమకి డిటి 3000 ఎలక్ట్రిక్ స్కూటర్ మాక్సిమం 180 కిమీ నుండి 220 కిమీల రేంజ్‌ స్పీడ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.ఇక కోమకి డిటి 300 ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది గంటకు మాక్సిమం 90 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ బైక్ లో విభిన్న రైడింగ్ మోడ్స్ కూడా ఉండనున్నాయి, రైడర్ సెలెక్ట్ చేసుకొనే మోడ్ ను బట్టి దాని రేంజ్ మారుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ మూడు రంగులలలో రిలీజ్ చేయనుంది. ఇక ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో రిపేర్ స్విచ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ స్విచ్ ఇంకా అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అనేక అప్ డేటెడ్ ఫీచర్లు ఉండనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: