ఇక ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) విక్రయిస్తున్న ప్రీమియం క్లాసిక్ మోటార్‌సైకిళ్లకు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో నుండి కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, ఈ బుల్లెట్ బండి విక్రయాలు బుల్లెట్ వేగంతో స్పీడ్ గా దూసుకుపోతున్నాయి. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్చి 2022 నెలలో మొత్తం 67,677 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మింది. ఇక గత ఏడాది ఇదే నెలలో (మార్చి 2021లో) కంపెనీ అమ్మిన 66,058 యూనిట్లతో పోలిస్తే ఇవి 2.39 శాతం వృద్ధిని నమోదు చేయడం జరిగింది.అయితే, మార్చి 2022 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో స్వల్పంగా 3 శాతం క్షీణతను నమోదు చేయడం జరిగింది. మార్చి 2021 లో దేశీయ విక్రయాలు 60,173 యూనిట్లుగా ఉంటే, మార్చి 2022 లో ఇవి మొత్తం 58,477 యూనిట్లుగా ఉన్నాయి.
కాగా, ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం 50 శాతానికి పైగా పెరిగడం జరిగింది. అలాగే మార్చి 2022లో కంపెనీ మొత్తం 9,200 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇవి గత సంవత్సరం మార్చి 2021లో ఎగుమతి చేసిన 5,885 యూనిట్ల కంటే 56 శాతం అధికంగా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే, స్క్రామ్ 411 తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం, ఈ కంపెనీ తదుపరి బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కావచ్చని తెలుస్తోంది. ఇది మీటియోర్ 350 J ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..హంటర్ 350 మోటార్‌సైకిల్ ను కంపెనీ ఈ ఏడాది మధ్య భాగనం నాటికి భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని సమాచారం తెలుస్తుంది. అయితే, దీని లాంచ్‌కు సంబంధించిన కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని తెలపారు.