Hero Xpulse 200 4V: సరికొత్త అప్డేట్స్ తో వచ్చేసింది!

Purushottham Vinay
ఫేమస్ టూ వీలర్ తయారీ కంపెనీ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన విభాగంలో అత్యంత ఫేమస్ అయిన అడ్వెంచర్ బైక్ 'ఎక్స్‌ప్లస్‌ 200 4వి' (Xpulse 200 4V) కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్‌లను అందించింది. ప్రస్తుతం ఈ అప్డేట్ అనేది కేవలం టర్కిష్ మార్కెట్లో అమ్మబడుతున్న 'హీరో ఎక్స్‌ప్లస్‌ 200 4వి' కి మాత్రమే అందించబడింది. కాబట్టి టర్కిష్ మార్కెట్లో అమ్మబడుతున్న 'ఎక్స్‌ప్లస్‌ 200 4వి' బైక్ లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ అందుబాటులో ఉంటుంది.అయితే ఇప్పుడు భారతీయ మార్కెట్లో అమ్మబడుతున్న ఈ బైక్ లో స్టాండర్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ మాత్రమే ఉపయోగించబడింది. రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్లో అమ్మబడుతున్న 'హీరో ఎక్స్‌ప్లస్‌ 200 4వి' కూడా ఈ అప్డేట్ పొందే అవకాశం ఉంది.ఇక హీరో మోటోకార్ప్ ప్రస్తుతం హెడ్‌లైట్‌ను మాత్రమే అప్‌డేట్ చేసింది. బైక్ లోని ఇతర ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్ లాగానే ఉంటాయి.


ఇక ఇప్పుడు కొత్త hero Xpulse 200 4V డిజైన్ విషయానికి గనుక వస్తే, ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ బైక్ దాని మునుపటి మోడల్ కి సమానంగా ఉంటుంది. కానీ దాని ట్యాంక్‌లో '4V' స్టిక్కర్ వంటివి కూడా మీరు గమనించవచ్చు. ఇక అంతే కాకుండా ఇది మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలతో కూడా వస్తుంది. అలాగే ఈ బైక్ లో ట్రైల్ బ్లూ, బ్లిట్జ్ బ్లూ ఇంకా అలాగే రెడ్ రైడ్ ఉన్నాయి.ఇక ఈ కొత్త hero Xpulse 200 4V బైక్ లో ఎల్ఈడీ హెడ్‌లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, రెండు ట్రిప్ మీటర్లు ఇంకా అలాగే ఒక సింగిల్ ఛానల్ ABS తో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడా వస్తుంది.అలాగే ఈ బైక్ ముందు భాగంలో 90/90-21 టైర్లు ఇంకా అలాగే వెనుక భాగంలో 120/80-18 టైర్లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: