ట్రైయంప్ టిఈ1: పూర్తి చార్జ్ పై 160 కిమీ రేంజ్!

Purushottham Vinay
ప్రపంచ మొత్తం కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో అనేక రకాల ఆటోమొబైల్ తయారీదారులు తమ ప్రోడక్ట్ ఫోలియోలో కనీసం ఒక ఎలక్ట్రిక్ వాహనాన్నైనా అందించాలని చూస్తున్నాయి. ఇక తాజాగా, బ్రిటీష్ లగ్జరీ టూవీలర్ కంపెనీ ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ కూడా తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ బైక్ టిఈ-1 (TE-1)ని విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. ఇక ఇందులో భాగంగా, కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ కి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా వెల్లడి చేసింది.ఇక ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రోటోటైప్ 15 కిలోల మోటార్/ఇన్వర్టర్ అసెంబ్లీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేస్తే ట్రైయంప్ టిఈ-1 గరిష్టంగా మొత్తం 160 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.దీని పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల దాకా వేగాన్ని చేరుకుంటుంది.ఇక ఈ ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 175 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని ట్రైయంప్ తెలిపింది. ఇది జీరో ఎస్ఆర్/ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ ఇంకా అలాగే హార్లే-డేవిడ్‌సన్ లైవ్ వైర్ వన్‌ మోడళ్లకంటే కూడా ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 25 శాతం తేలికైనదని కంపెనీ పేర్కొంది. ఈ బరువు బ్యాలెన్స్ చేయడం కోసం అల్యూమినియంతో చేసిన ఫ్రేమ్ ను ఉపయోగించడం జరిగింది.ఈ ట్రైయంప్ టిఈ-1 ఇ-బైక్ మొత్తం బరువు 220 కిలోలుగా ఉంటుంది.


ఈ ఎలక్ట్రిక్ బైక్‌ ను ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 25 నిమిషాల్లోనే 0 నుండి 100 శాతం వరకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.ఇక ఇంత వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్ ఉన్న మోడల్ ప్రస్తుతం మార్కెట్లో మరొకటి లేదనే చెప్పాలి. ఈ ప్రోటోటైప్ అభివృద్ధిలో ఉన్న ప్రాజెక్ట్‌ కావడంతో కంపెనీ ఈ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ను ఇంకా అధికారికంగా క్లెయిమ్ అనేది చేయడం లేదు. అయితే ఇక ఈ ఫీచర్ రియల్ టైమ్ లో కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే, బ్యాటరీ ఛార్జింగ్ సమయం ఇక గణనీయంగా ఆదా అవుతుంది.ఇక డిజైన్ వివరాలను పరిశీలిస్తే, ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్ ఓవరాల్ డిజైన్ లేఅవుట్ ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న స్ట్రీట్ ఇంకా స్పీడ్ ట్రిపుల్ లైనప్‌ను గుర్తు చేస్తుంది.అలాగే ఇందులో ముందు వైపు సిగ్నేచర్ ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, యాంగ్యులర్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు ఇంకా అలాగే స్వెప్టె‌బ్యాక్ సీట్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఈ బ్రాండ్ స్పోర్టీ రోడ్‌స్టర్‌ బైక్ ల నుండి స్పూర్తి పొందినట్లుగా అనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: