రాష్ట్రపతి వాడే కార్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Purushottham Vinay
ద్రౌపతి ముర్ము గారు భారదేశానికి కేవలం 15 వ రాష్ట్రపతి మాత్రమే కాదు.. ఈమె మొదటి గిరిజన రాష్ట్రపతి కూడా. ముర్ము గిరిజన జాతిలో పుట్టిన ఓ ఆణిముత్యం.. ఈమె గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే,అయితే భారత రాష్ట్రపతిగా ఎంతో విలువైన పదవిని స్వీకరించిన ముర్ము.. ఎలాంటి కారులో తిరగనున్నారు ఇంకా ఆ కారు  విశేషాలేమిటి అనే మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక దేశానికి రాష్ట్రపతిగా ఉండే వ్యక్తికి నివసించడానికి రాజ్ భవన్ మాత్రమే కాదు, తిరగడానికి కూడా పటిష్టమైన భద్రతలు కలిగిన 'మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్600 పుల్మాన్ గార్డ్' కూడా కేటాయించడం జరుగుతుంది.ఈ మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. ఇది రాష్ట్రపతిని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన అన్ని భద్రతా పరికరాలను కూడా కలిగి ఉంటుంది. కావున బాంబుల వంటివి కూడా ఈ కారును అసలు ఏమి చేయలేవు. రాష్ట్రపతి సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడిన 'మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్' విఆర్ 10 బాలిస్టిక్ రక్షణతో తయారు చేయబడింది. ఇక ఈ కారు దాదాపు ఏ విధమైన దాడి నుండి అయిన కాపాడటానికి అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది.


ఇక సాధారణంగా హ్యాండ్ గ్రెనేడ్ వంటి వాటి నుంచి మాత్రమే కాకుండా.. మెషిన్ గన్ వంటి వాటి నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. అదే సమయంలో అనుకోని పరిస్థితుల్లో గ్యాస్ దాడులు వంటివి కనుక జరిగితే లోపలి వ్యక్తులను రక్షించడానికి ఈ కారులోపల ఆక్సిజన్ సిలిండర్లు అనేవి కూడా అందుబాటులో ఉంటాయి.రాష్ట్రపతి ఉపయోగించే ఈ కారు మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో అమర్చబడి ఉంటుంది. ఇది స్టీల్ స్ప్రింగ్‌లతో, మంచి డీక్లెరేషన్ ఇంకా రన్-ఫ్లాట్ టైర్లను కలిగి ఉంటుంది.రక్షణ ఇంకా భద్రతా పరికరాలతో పాటు, 21.3 అడుగుల పొడవైన లిమోసిన్ విలాసవంతమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్ అలాగే రక్షణ కవచాలు కలిగి ఉండటం వల్ల దీని బరువు 5 టన్నులకు పైగా ఉంటుంది. అయితే దీని కొలతలను కనుక ఒక సారి గమనిస్తే, దీని పొడవు 5,453 మిమీ ఇంకా వెడల్పు 1,899 మిమీ, ఎత్తు 1,498 మిమీ అలాగే 3,365 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది.ఇక ఇది 6.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 530 బిహెచ్‌పి ఇంకా 830 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.


ఈ ఇంజన్ అనేది 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు కూడా వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి గంటకు 160 కిమీ వరకు ఉంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ మొత్తం 80 లీటర్లు.ఇందులో 530 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఉంటుంది. ఈ కారు ధర వచ్చేసి 10 కోట్లకంటే ఎక్కువ ఉంటుంది. ఈ మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్‌ కారు రాష్ట్రపతి ప్రయాణానికి ప్రత్యేకంగా తయారుచేయబడిన ఒక రక్షక కవచం అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: