భారత దేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకి, తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లో ఓ సిఎన్జి వెర్షన్ ను సైలెంట్ గా మార్కెట్లో విడుదల చేసింది.ఇక భారత మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి (Maruti Suzuki Swift CNG) రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది.ఇందులో ఒకటి స్విఫ్ట్ సిఎన్జి విఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 7.77 లక్షలు కాగా,రెండోది స్విఫ్ట్ సిఎన్జి జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 8.45 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అలాగే స్విఫ్ట్ సిఎన్జి కోసం కంపెనీ బుకింగ్ లను కూడా ప్రారంభించింది. ఇంకా త్వరలోనే వీటి డెలివరీ కూడా ప్రారంభం కానుంది.ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్తగా వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి హ్యాచ్‌బ్యాక్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన సిఎన్జి పవర్డ్ హ్యాచ్‌బ్యాక్ గా కూడా నిలుస్తుంది. ఇందులోని 1.2 లీటర్ కె-సిరీస్ డ్యూయల్ జెట్ ఇంకా డ్యూయల్ వివిటి ఇంజన్ సిఎన్జి మోడ్ లో గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 77.49 పిఎస్‌ల శక్తిని ఇంకా 4300 ఆర్‌పిఎమ్ వద్ద 98.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో 89 పిఎస్ శక్తిని ఇంకా 113 ఎన్ఎమ్ టార్క్ ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.ఇక మారుతి సుజుకి ప్రకారం, కొత్త స్విఫ్ట్ cng మోడల్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇంకా అలాగే అత్యంత ఇంధన-సమర్థవంతమైన సిఎన్జి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తుంది.
అలాగే కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, కొత్త స్విఫ్ట్ సిఎన్జి కేజీకి 30.90 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది. ఇక మీ సమాచారం కోసం, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన స్విఫ్ట్ లీటరుకు మొత్తం 23.20 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుండగా, ఆటో గేర్ షిఫ్ట్ యూనిట్‌తో కూడిన స్విఫ్ట్ లీటరుకు మొత్తం 23.76 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.ఇక ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తమ కొత్త స్విఫ్ట్ కోసం ఓ ప్రత్యేకమైన నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది.ఇంకా ఆసక్తిగల కస్టమర్లు ఈ కారును నేరుగా కొనుగోలు చేయకుండా, సబ్స్క్రిప్షన్ విధానంలో కూడా ఈ కొత్త స్విఫ్ట్ కారును లీజుకు లేదా అద్దెకు తీసుకోవచ్చు. దీనికోసం నిర్ధిష్ట అగ్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఈ స్విఫ్ట్ కోసం ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కేవలం రూ. 16,499 నుండే ప్రారంభమవుతుంది. అంటే ప్రతినెలా కూడా వినియోగదారులు పై మొత్తాన్ని చెల్లించడం ద్వారా స్విఫ్ట్ కారు కొంత కాలం పాటు లీజుకు తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత అదే కారును సొంతం చేసుకోవాలనుకుంటే, మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించి యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోవచ్చు.