భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా తక్కువ కాలంలోనే అమ్మకాల్లో దూసుకెళ్తున్న 'కియా మోటార్స్' యొక్క 'సోనేట్' ఇప్పుడు భారతీయ మార్కెట్లో 'కియా సోనేట్ ఎక్స్ లైన్' అనే పేరుతో విడుదలైంది. ఈ కొత్త సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.39 లక్షలు.కొత్త 'కియా సోనేట్ ఎక్స్ లైన్' డీజిల్ ఇంకా పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ కలిగిన సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.99 లక్షలు, ఇక పెట్రోల్ ఇంజిన్ కలిగిన సోనేట్ ఎక్స్ లైన్ ధర రూ. 13.39 లక్షల వరకు ఉంది.కియా సొనెట్ ఎక్స్ లైన్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇది మాట్ గ్రాఫైట్ కలర్ షేడ్ పొందుతుంది. అందువల్ల చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రిల్ గ్లోస్ బ్లాక్ కలర్‌లో ఉండటం గమనించవచ్చు. ముందు వెనుక స్కిడ్ ప్లేట్లు డార్క్ మెటల్ యాక్సెంట్‌లతో పియానో బ్లాక్ కలర్‌ను పొందుతాయి. ఫాగ్ ల్యాంప్‌లో గ్లోస్ బ్లాక్ కలర్ ఇవ్వబడింది, అదే సమయంలో మిర్రర్స్ ఇంకా డోర్‌లపై డార్క్ మెటల్ యాక్సెంట్‌లు ఉన్నాయి. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఫినిష్ అయి ఉంటుంది.సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ సిల్వర్ బ్రేక్ కాలిపర్‌లతో వస్తాయి. అయితే GT వేరియంట్‌లో మాత్రం రెడ్ కలర్ లో ఉండటం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్ లైన్ ని ప్రత్యేకంగా గుర్తించడానికి అనుకూలంగా ఉంటాయి.
ఇంటీరియర్ కొత్త డ్యూయల్ టోన్ కలర్‌లో ఉంటుంది. ఇందులోని సీట్లు లెదర్ అపోల్స్ట్రే పొంది చాలా స్పోర్టీగా ఉంటాయి. అంతే కాకుండా సీట్లపైన రెడ్ స్టిచ్చింగ్ కూడా చూడవచ్చు. ఇది మరింత మంచి లుక్ ఇస్తుంది. స్టీరింగ్ వీల్ కూడా లెదర్ తో చుట్టబడి మంచి గ్రిప్ ఇస్తుంది.ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఈ కొత్త సోనెట్ ఎక్స్ లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే, మనం ఇంతకు ముందు మొదట్లో చెప్పుకున్నట్లుగా ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, కియా సోనెట్ ఎక్స్ లైన్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, బ్రేక్ అసిస్ట్ ఇంకా రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అందువల్ల వాహనదారుల సేఫ్టీకి అసలు ఏ మాత్రం డోకా ఉండదు.