మారుతి సుజుకి గ్రాండ్ విటారా: అదిరిపోయే బుకింగ్స్?

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో 'మారుతి సుజుకి' కంపెనీ  వాహనాలకు ఉన్న ఆదరణ ఇంకా డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఎందుకంటే ఒకప్పటినుంచి ఇండియన్ మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో ఇప్పటికి కూడా అదే ఊపుతో ముందుకెళుతున్న మారుతి సుజుకి ఇటీవల మారుతి ఆల్టో కె10 లాంచ్ చేసింది, కాగా 2022 సెప్టెంబర్ చివరి నాటికి తన 'గ్రాండ్ విటారా' ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది.కంపెనీ  ఈ కొత్త SUV ఇండియన్ మార్కెట్లో ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, అయినప్పటికి బుకింగ్స్ పరంగా మాత్రం దూసుకుని వెళ్ళిపోతోంది.మారుతి సుజుకి తన గ్రాండ్ విటారా SUV ని దేశీయ మార్కెట్లో జులై 20 న అధికారికంగా ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ SUV కోసం ఆవిష్కరణకు ముందే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. కాగా ఇప్పటికే గ్రాండ్ వితారా బుకింగ్స్ లో ఏకంగా 53,000 యూనిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇది నిజంగానే గొప్ప విషయం.కొత్త గ్రాండ్ విటారా పొందిన 53,000 బుకింగ్స్ లో దాదాపు 23,000 యూనిట్లు అందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ పొందాయని తెలుస్తోంది. అంతే కంపెనీ  స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ మంచి బుకింగ్ పొందుతోంది అని స్పష్టమవుతోంది.



మారుతి గ్రాండ్ వితారా బుక్ చేసుకునే ప్రతి 5 మంది కస్టమర్లతో కనీసం ఇద్దరు ఈ హైబ్రిడ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు.మారుతి సుజుకి  గ్రాండ్ వితారా దాని S-క్రాస్ స్థానంలో వస్తోంది. ఇది బెంగుళూరు సమీపంలోని బిడాడి ఫ్యాక్టరీలో నిర్మించబడి మారుతి సుజుకి డీలర్‌లకు పంపుతుంది. ఈ కొత్త మారుతి సుజుకి SUV ఆధునిక డిజైన్ ఇంకా అధునాతన పరికరాలను పొందుతుంది. ఇందులో ఇప్పుడు కొత్త గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ మధ్య భాగంలో పెద్ద సుజుకి బ్యాడ్జ్‌ ఉంది. దీనికి సమీపంలోనే 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి, అదే సమయంలో రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ టర్న్ లైట్లు ఇంకా 3-ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి.గ్రాండ్ విటారా సైడ్ ప్రొఫైల్ లో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ లైట్ ఇంకా బ్రాండ్  లోగో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త ఎస్‌యూవీ మరింత ఆధునికంగా కనిపించేలా చేస్తాయి. మొత్తం మీద గ్రాండ్ వితారా డిజైన్ చాలా గ్రాండ్ గానే ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: