ఇక పండుగ సీజన్ కావడంతో చాలా మంది వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ సీజన్‌లో రేట్లు తగ్గుతాయని భావించి ఎంతగానో ఎదురు చూస్తుంటారు.పండుగ వేళ కారు కొనుగోలు చేద్దామని ఎదురు చూస్తున్నవారికి బిగ్ షాక్ ఇచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ. బొలెరో బి4 కారు ధరను భారీగా పెంచేసింది. కారు ఎక్స్ షోరూమ్ ధరపై రూ.20,000 వేలు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ధర పెరగకముందు బొలెరో ధర రూ. 9.31 లక్షలు ఉండగా, తాజా పెంపుతో ధర రూ.9.53 లక్షలకు పెరిగింది. అదే సమయంలో కంపెనీ బొరెలో బి6 ధరను రూ. 22,701 పెంచింది. ఇంతకు ముందు ఈ మోడల్ ధర రూ. 9.77 లక్షలు ఉండేది, ఇప్పుడు పెంచిన ధరతో కలిపి రూ. 10 లక్షలకు చేరింది.ఇక మహీంద్ర బొలెరో B6(0) మోడల్ ధర కూడా పెంచారు. సుమారు రూ. 22,000 పెరిగింది.
గతంలో ఈ మోడల్ ధర రూ. 10.26 లక్షలు కాగా, ఇప్పుడు ధర రూ. 10.48 లక్షలకు పెరిగింది. బొలెరో నియో ధరను కూడా పెంచారు. గతంలో ఈ కారు ధర రూ. 9.31 లక్షలు(ఢిల్లీ ఎక్స్-షోరూమ్), పెరిగిన ధరతో కలిపి రూ. 9.53 లక్షలకు చేరింది. అంటే రూ. 20,502 పెంచడం జరిగింది. అదే సమయంలో మహీంద్రా బొలెరో టాప్ వేరియంట్ ధర కూడా రూ. 11.79 లక్షల నుంచి రూ. 11.99 లక్షలకు పెంచింది.కార్ల మార్కెట్‌లో బొలెరో 20 సంవత్సరాలుగా ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. ఈ కారు క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అదే సమయంలో కంపెనీ.. ఈ కారు మోడల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంది. మహీంద్రా కంపెనీకి సంబంధించి ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో బొలెరో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా కార్లను విక్రయించింది.