ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ నుంచి మరో సూపర్ వేరియంట్‌?

Purushottham Vinay
బ్రిటిష్ కార్ బ్రాండ్ అయిన ఎమ్‌జి మోటార్ ఇండియా ఇండియన్ మార్కెట్లో అమ్ముతున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) పేరుతో కంపెనీ ఇందులో ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో ఈ వేరియంట్ ధర రూ. 22.58 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త వేరియంట్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ వేరియంట్ ప్రత్యేకమైన డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ థీమ్‌తో లభిస్తుంది. ఇదివరకు ఈ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది మరియు దాని ధర రూ. 26.60 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ప్రస్తుతం ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ బ్లాక్ మరియు ఐవరీ డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌లలో పరిచయం చేయబడింది. అలాగే, ఇందులో సింగిల్ టోన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో లభించే కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఐ-స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, డ్యూయల్-పాన్ పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కొత్త ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో అందించబడ్డాయి.


కొత్త i-Smart ఫీచర్‌లలో ఫర్మ్‌వేర్ ఓవర్-ది-ఎయిర్ (FOTA) అప్‌డేట్, Park+ నేటివ్ యాప్, MapmyIndia ఆన్‌లైన్ నావిగేషన్, Discover యాప్ ఇంకా లైవ్ వెదర్ అప్‌డేట్‌లు ఉన్నాయి.ఇక కొత్తగా విడుదల చేయబడిన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది కూడా ఇప్పుడు కొత్త ఐ-స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, హిల్-డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక ప్రయాణీకుల కోసం ఏసి వెంట్‌లు మొదలైన వాటిని పొందుతుంది. ఇందులో, కస్టమర్‌లు 75 కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 10.1 ఇంచ్ హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎంబెడెడ్ LCD స్క్రీన్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా ఇంకా డిజిటల్ కీ వంటి స్టాండర్డ్ ఫీచర్లను పొందుతుంది. ఎమ్‌జి మోటార్స్ గడచిన మార్చి నెలలో భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (2022 MG ZS EV) ని విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మనుపటి కన్నా మెరుగైన డిజైన్ ఇంకా అలాగే ఫీచర్లను కూడా పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: