ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ 'ఓలా ఎలక్ట్రిక్' ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతూ ఎంతో అత్యధిక ప్రజాదరణ పొందుతోంది.కంపెనీ గత కొన్నిరోజుల కిందట దీపావళి పండుగను పురస్కరించుకుని కస్టమర్ల కోసం ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. చెప్పిన విధంగానే ఈ రోజు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో తన ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎస్1 ఎయిర్' (S1 Air) విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ. 79,999 మాత్రమే. కంపెనీ ఈ ధర వద్ద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2022 అక్టోబర్ 24 వరకు మాత్రమే అందిస్తుంది. అంటే కేవలం రెండు రోజులు మాత్రమే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 79,999 కి అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉండవచ్చు.
ఛార్జింగ్ విషయానికి వస్తే 'ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది. ఈ S1 ఎయిర్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ ఇంకా ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండటమే కాకుండా రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.ఓలా 'ఎస్1 ఎయిర్' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో 'ఎకో మోడ్' లో మాక్సిమం 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఇంకా 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.ఓలా 'ఎస్1 ఎయిర్' (S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎస్1 ఇంకా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకంటే తక్కువ ఫీచర్స్ ఇంకా అలాగే తక్కువ రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అందువల్ల ఇందులో ఎకో, నార్మల్ ఇంకా స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.