ఇండియన్ మార్కెట్లో బాగా ఫేమస్ అయిన అమెరికన్ కార్ కంపెనీ 'జీప్' ఇండియన్ మార్కెట్లో మరో కొత్త SUV ని విడుదల చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే, అయితే ఈ కొత్త SUV వచ్చే నెల 11 న (2022 నవంబర్ 11) విడుదల కానున్నట్లు కంపెనీ తెలిపింది.జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV పేరు 'గ్రాండ్ చెరోకీ'. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న రాంగ్లర్ , కంపాస్ మరియు మెరిడియన్ తరువాత విడుదల కానున్న నాలుగవ మోడల్ కానుంది. కొత్త 'గ్రాండ్ చెరోకీ' అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ అప్డేటెడ్ ఫీచర్స్ పొందనుంది.కొత్త గ్రాండ్ చెరోకీ ఇప్పటికే గ్లోబెల్ మార్కెట్లో 5 సీటర్ ఇంకా 7 సీటర్ మోడల్స్ లో అమ్ముతుంది. కాగా భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ మోడల్ కేవలం 5 సీటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే 7 సీటర్ మన దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చు.కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ SUV 7 స్లాట్ గ్రిల్ కలిగి ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో స్లిమ్ హెడ్‌లైట్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని D-పిల్లర్ వద్ద ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్ చూడవచ్చు.
రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ లైట్స్ చూడవచ్చు. ఇక దీని ఇంటీరియర్ డిజైన్ ఇంకా అలాగే ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ ఇంకా కో-డ్రైవర్ ముందు మరో డెడికేటెడ్ టచ్‌స్క్రీన్ వంటి డిస్‌ప్లేలు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే ఇంకా అలాగే పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి లభిస్తాయి.దీని ఇంటీరియర్ లో సౌకర్యవంతమైన సీట్లు కూడా ఉంటాయి. అలాగే లోపల భాగంలో ఎక్కువగా బ్రౌన్, బ్లూ ఇంకా బ్లాక్ కలర్స్ చూడవచ్చు. ఇవన్నీ ఇంటీరియర్ ని మరింత అద్భుతంగా చూపించడంలో సహాయపడతాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే ఇంకా అలాగే పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.