ఇండియన్ మార్కెట్లో 'టొయోట' కంపెనీ కొత్త 'హైక్రాస్' ఎమ్‌పివిని విడుదల చేయడానికి తగిన ప్లాన్ రెడీ చేస్తోంది.కంపెనీ ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం, 2022 నవంబర్ 25 న ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. కాగా ఈ ఇన్నోవా హైక్రాస్ 2023 లో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఎమ్‌పివి భారతీయ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముందే ఇండోనేషియాలో నవంబర్ 21 న ఆవిష్కరించబడుతుంది. దీన్ని బట్టి చూస్తే టొయోట కొత్త హైక్రాస్ ఎమ్‌పివిని ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకూండా విదేశీ మార్కెట్లో కూడా అమ్మడానికి తయారవుతోందని అర్థమవుతోంది.ఈ MPV అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుందని తెలుస్తుంది. ఇందులో హెక్సాగోనల్ గ్రిల్ అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ఎల్ షేప్ ఇన్సర్ట్‌తో విస్తృతంగా విస్తరించబడిన హెడ్‌లైట్ ఉంటుంది. అదే సమయంలో దీని బానెట్‌పై క్రీజ్, బంపర్‌పై ఫాగ్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. కాగా రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ బ్రేక్ లైట్‌తో సమాంతరంగా ఉండే టెయిల్ లైట్ కూడా లభిస్తాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ సైడ్ ప్రొఫైల్ లో పెద్ద వీల్ ఆర్చ్‌లు ఇంకా క్యారెక్టర్ లైన్స్ వంటివి చూడవచ్చు. అదే సమయంలో హైక్రాస్ బ్యాడ్జ్ కూడా చూడవచ్చు. మొత్తమ్ మీద ఇది ఇన్నోవా క్రిష్టా కంటే కూడా చాలా వరకు భిన్నంగా ఉంటుంది.ఇంటీరియర్స్ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుందని మొదట్లోనే తెలిసిపోయింది. అంతే కాకుండా ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్సన్ వంటి వాటితో పాటు రెండవ వరుస కెప్టెన్ సీట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 2.0 లీటర్ లేదా 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులోని హైబ్రిడ్ ఇంజన్ కారణంగా ఇది ఖచ్చితంగా మంచి మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న దీని ఇంజిన్ 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.