టియాగో ఎన్ఆర్‌జి: సిఎన్‌జి వెర్షన్ విడుదల?

Purushottham Vinay
టియాగో ఎన్ఆర్‌జి: సిఎన్‌జి వెర్షన్ విడుదల?

ప్రముఖ ఇండియన్  కార్ల కంపెనీ 'టాటా మోటార్స్' ఇండియన్  మార్కెట్లో తన కొత్త 'టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి' ఆఫీషియల్ గా విడుదల చేసింది.ఇక దీనికి పాత మోడల్ లాగానే బూట్ లో cng ట్యాంక్ అమర్చబడి ఉంటుంది.  ఇందులో కూడా బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి నాలుగు కలర్ ఆప్షన్స్ లో ఉంది. అవి క్లౌడీ గ్రే, పోలార్ వైట్, ఫైర్ రెడ్ ఇంకా ఫారెస్టా గ్రీన్ కలర్స్.టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి  డిజైన్ ఇంకా ఫీచర్స్ చాలా వరకు దాని పాత మోడల్ గుర్తుకు తెస్తుంది. అయితే ఇందులో చుట్టూ బ్లాక్ బాడీ క్లాడింగ్, ముందు ఇంకా వెనుక కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ రూఫ్, రూఫ్ రెయిల్‌లు, ఫాగ్ లైట్లు, టెయిల్ గేట్‌పై ప్లాస్టిక్ క్లాడింగ్ ఇంకా అలాగే డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.


ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకూండా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ కోసం కంట్రోలర్‌లతో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ ఆడియో సిస్టమ్ ఇంకా హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి.ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి మొదలైనవి అందుబాటులో ఉంటాయి. అయితే టాప్-స్పెక్ వేరియంట్ లో స్టాండర్డ్ గా రియర్ పార్కింగ్ కెమెరా ఫీచర్ కూడా ఉంటుంది. మొత్తం మీద కొత్త టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి డిజైన్ ఇంకా ఫీచర్స్ పరంగా మాత్రమే కాకూండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంది.ధర విషయానికి వస్తే..టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: